కరోనా వైరస్ కారణంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ చాలా పటిష్టంగా అమలు చేస్తుంది. దేశ ప్రజలంతా ఇళ్ల కే పరిమితమయ్యారు. ఇంటి నుండి ఎవరూ కూడా అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి. దీంతో ఒకానొక టైములో సెలవులు వస్తే సినిమా హాలు అని పార్కులు గాని వెళ్లేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రంగాలు మూత పడిపోయాయి. సినిమా హాల్ కూడా క్లోజ్ అయిన సంగతి అందరికీ తెలిసినదే.
ఇటువంటి తరుణంలో ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులు ప్రస్తుతం ఇంట్లో ఉంటూ సోషల్ మీడియాపై పడ్డారు. టీవీలో వస్తున్న సీరియల్ సినిమాలకంటే సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రేక్షకులు యూట్యూబ్ లో ఉంటున్నారట. యూట్యూబ్ లో ఉన్న వీడియోలను దున్నేస్తున్నరట. ముఖ్యంగా వంట ఛానల్స్ వీడియో లకు బాగా డిమాండ్ పెరిగింది అట. చాలామంది వ్యూయర్స్ వంట వీడియోస్ ని బాగా చూస్తున్నారట. ఆ భాష ఈ భాష అని లేదు అన్ని వంట చానల్స్ వీడియోస్ కి ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో బాగా రెవిన్యూ సంపాదిస్తున్నారట.
కొత్తగా పెళ్లిళ్లు కావటం, తర్వాత ఇంటిలో కుటుంబ సమేతంగా ఉండటంతో.. ఉన్న సమయాన్ని కుటుంబంతో ఆనందంగా గడపడానికి రుచికరమైన సరికొత్త వంటకాల కోసం వ్యూయర్స్ యూట్యూబ్ లో అనేక వీడియోలు సెర్చ్ చేస్తున్నారట. ఇదే టైమ్ లో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ కలిగిన నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటివి కూడా ఊహించని రీతిలో రెవిన్యూ కొత్త సబ్ స్క్రైబర్స్ తో పాటు భారీ స్థాయిలో రెవిన్యూ సంపాదించుకుంటున్నయి.