ఓర్ని.. టమోటా ట్రక్కను హైజాక్‌ చేసి రూ. 2.7 లక్షలు విలువైన టమోటాలు చోరి చేసిన దుండగులు

-

టమోటా ధరలు ఘోరంగా పెరిగాయి. మినిమమ్‌ 120- 500 వరకూ ఉన్నాయి. కొన్ని ఏరియాల్లో అయితే టమోటాల దుకాణం వద్ద బౌన్సర్లను కూడా ఏర్పాటు చేసుకున్నారు. సామాన్యులకు ఇవి బంగారంతో సమానం అయిపోయాయి. ఏదో ఫ్లైట్‌ను హైజాక్‌ చేసినట్లు తాజాగా ఇప్పుడు టమోటా లారీని కొందరు దుండగలు హైజాక్‌ చేశారు. కర్ణాటకలో ఓ ముగ్గురి గ్యాంగ్.. ట్రక్కును హైజాక్ చేసి టమాటాలను చోరీ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బెలూర్ తాలూకాలో రూ.2.7 లక్షల విలువైన టమాటాలను దోచేశారు. టమాటాలతో వెళ్తున్న ట్రక్కు డ్రైవర్‌తో చిక్కలజ రోడ్డుపై గొడవ పెట్టుకున్న ముగ్గురూ… ఆ తర్వాత ఆ ట్రక్కుతో సహా పారిపోయారు. అందులో 2వేల కేజీల టమాటాలున్నాయి. ప్రస్తుతం కేజీ టమాటాల ధరలు డబుల్‌ సెంచరీ కూడా దాటేయడంతో ఈ హైజాక్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనలో బాధితుడు చిత్రదుర్గ జిల్లాలోని హిరియూర్‌కి చెందిన రైతు. శనివారం ట్రక్కు నిండా టమాటాలను నింపుకొని అతను.. సిటీకి బయలుదేరాడు. దారిలో ఓ కారు, ట్రక్కును ఫాలో అయ్యింది. ఆ రైతు ఆ కారును పట్టించుకోలేదు. తన దారిన తాను వెళ్తున్నాడు. RMC యార్డ్ దగ్గరకు రాగానే ట్రక్కును ఓవర్ టేక్ చేసిన దుండగులు కారును రోడ్డుపై ట్రక్కుకు అడ్డుగా ఆపారు. దాంతో రైతు లారీ ఆపాడు. ట్రక్కుతో కారును ఢీకొట్టాడని రైతుతో వాదనకు దిగారు. అలా ఏమీ చెయ్యలేదని రైతు చెప్పినా వాళ్లు వినలేదు. రైతును పక్కకు నెట్టేసి టమాటాలతో సహా ట్రక్కును పట్టుకుపోయారు.

ఇలా దేశవ్యాప్తంగా టమాటాల చోరీలు బాగా జరుగుతున్నాయి. టమోటా రైతులు వాటిని కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. షాప్‌ దగ్గరకు కూడా ఒకేసారి జనం రావడం తోసుకోవడం పావు కేజీ అడిగి ఒక రెండు టమాటాలను ఎత్తేయడం ఇలా చాలా జరుగుతున్నాయి. పాపం టమాట రైతుల పంట పండిందనుకుంటే.. వాళ్లు వాటిని కాపడుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. ఏది ఏమైనా.. మరో 2 వారాల్లో ఈ ధర తగ్గే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఇలాంటి చోరీలు కూడా ఆగొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news