మీ బిడ్డను తెలివిగా మార్చాలంటే.. ఇలా చేయండి..!

-

పిల్లల్ని పెంచడం తల్లిదండ్రులకి నిజంగా ఎంతో పెద్ద టాస్క్. ఏదో అనుకుంటారు తల్లిదండ్రులు కానీ పిల్లలు ఓ లెక్కలో తల్లిదండ్రులకి చుక్కలు చూపిస్తూ ఉంటారు. బాగా పేచీ కూడా పెడుతూ ఉంటారు. చెప్పిన మాట వినరు. ఆహారాన్ని టైంకి తినరు ఇలా తల్లిదండ్రులకి పిల్లల్ని పెంచడం పెద్ద సవాల్ ఏ. చాలామంది పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు వాళ్లని మంచిగా మార్చాలని బుద్ధిగా ఉంచాలని తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు. అలానే వాళ్ళ పిల్లలు తెలివిగా ఉండాలని తల్లిదండ్రులు అనుకుంటారు.

అయితే ఈ మంచి అలవాట్ల తో మీ పిల్లల్ని మీరు తెలివిగా మార్చవచ్చు. సంగీతం నేర్పించడం వంటివి మీ పిల్లల దృష్టిని మెరుగుపరుస్తూ ఉంటాయి ఆలోచనలను పెంపొందిస్తూ ఉండొచ్చు కాబట్టి సంగీతాన్ని నేర్పించండి. త్వరగా నిద్ర లేవడం కూడా చాలా ముఖ్యం. ఇది చాలా మంచి అలవాటు. ఎంత ధ్యానం చేసినా ఎంతసేపు వ్యాయామం చేసిన మొదట ఉదయాన్నే లేవడం చాలా ముఖ్యం. పిల్లల తెలివితేటల్ని ఇలా పెంచొచ్చు అలానే తగినంత మనశ్శాంతిని ఇస్తే కూడా పిల్లలు చురుగ్గా మారుతారు.

వారికి శక్తి లభిస్తుంది ప్రతిరోజు 15 నిమిషాల పాటు మెడిటేషన్ చేయించండి అప్పుడు వాళ్ళకి ధైర్యం కూడా పెరుగుతుంది. ఏకాగ్రతని కూడా పెడతారు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇతరులతో మాట్లాడడం ఏదైనా టాపిక్ మీద చర్చించడం వంటివి కూడా మీ పిల్లల్ని మెరుగు పరుస్తాయి. మీ పిల్లలు తెలివితేటలని పెంచొచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. పుస్తక పఠనం చాలా ముఖ్యం ప్రతిరోజు ఒక పేజీ అయినా చదివేటట్టు ప్రోత్సహించండి అప్పుడు మీ పిల్లల తెలివితేటలు పెరుగుతాయి.

పైగా అన్ని విషయాల మీద వారికి అవగాహన కలుగుతుంది ఏదైనా ఒక విషయం చెప్పి దాని మీద రాయమని కూడా వాళ్ళల్లో స్కిల్స్ పెరుగుతాయి. శారీరక శ్రమ కూడా చాలా ముఖ్యం చాలా మంది ఈ రోజుల్లో పిల్లలకి స్మార్ట్ ఫోన్ ఇచ్చేస్తున్నారు అలా కాకుండా ఫిజికల్ ఆక్టివిటీ పై ధ్యాస పెట్టెలో చూడండి. గార్డెనింగ్ చేయడం కూడా పిల్లలు ఏకాగ్రత పెంచచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version