వామ్మో..ఎవరి గొంతునైనా ఇట్టే మిమిక్రీ చేయగల పక్షిని చూశారా?

పక్షులు అరవడం చాలా మంది చూసే ఉంటారు.. కొన్ని పక్షులు మాట్లాడటం వినే ఉంటారు.. కానీ మిమిక్రి చేసే పక్షులను బహుశా చూసి ఉండరు.ఎలాంటి శబ్దాన్ని అయినా ఇట్టే మిమిక్రీ చేసేయగలదు. విన్న శబ్దం ఏదైనా సరే.. వెంటనే ఆ పక్షి కూడా అచ్చం అలానే సౌండ్ చేస్తుంది. ఈ బర్డ్ టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వావ్.. వాటే టాలెంట్ అని మెచ్చుకుంటున్నారు.ఇక ఆ పక్షి గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఆ పక్షిని లైర్ బర్డ్ అంటారు. లైర్‌బర్డ్ అనేది నేలపై నివసించే ఆస్ట్రేలియన్ పక్షుల జాతి. ప్రకృతిలో వచ్చే సహజమైన శబ్దాలనే కాదు కృతిమమైన శబ్దాలను అనుకరించే సామర్థ్యం వాటికుంది. లైర్‌బర్డ్‌లు.. తాము విన్న శబ్దాలను ఎంతో అలవోకగా అనుకరిస్తాయి.. ఈ పక్షికి సంబందించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..

ఆ పక్షి విన్న శబ్దాలను వెంటనే అనుకరించడం వీడియోలో రికార్డ్ అయ్యింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ పక్షి టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వారెవ్వా వాటే టాలెంట్ అని ఆశ్చర్యపోతున్నారు… ఎలా ఉందో అలానే చేస్తుంది.. దీనిని చూసిన చాలా మంది రకరకాలుగా స్పందిస్తున్నారు.అమేజింగ్ అని ఒకరు ట్వీట్ చేస్తే, ఇది ప్లేయింగ్ బర్డ్ టెక్నోనా అని మరొకరు ట్వీట్ చేశారు.. ఇకపోతే ఈ పక్షి రైలు సైరన్ శబ్దాన్ని, ఈలను, సైరన్లను సౌండ్ చేయడం వీడియోలో ఉంది. ఈ వీడియో అందరినీ తెగ ఆకట్టుకుంటుంది.. అంతేకాదు నెట్టింట వైరల్ అవుతుంది.. ఎంత అందంగా ఉందో మీరు ఒకసారి చూడండి..

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?