క్రిస్మస్ డెకరేషన్ లో రెడ్ కలర్ ని ఎందుకు ఎక్కువ వాడతారు..? దాని వెనుక ఇంత బలమైన కారణం ఉందా..?

-

ప్రతీ ఏడాది డిసెంబర్ 25 న క్రిస్మస్ ని చేస్తూ వుంటారు. అయితే ఎప్పుడైనా మీకు సందేహం వచ్చిందా ఎందుకు క్రిస్మస్ డెకరేషన్ లో రెడ్ కలర్ ని ఎక్కువ వాడతారు అని.. ఏదో సరదాకి కాదు దాని వెనుక ఓ పెద్ద బలమైన కారణం వుంది. మరి దాని కోసమే ఇప్పుడు చూద్దాం. క్రిస్మస్ పండుగ వచ్చిందంటే చాలు ఈ పండుగ సందర్భంగా చాలా మంది తమ ఇళ్ల ముందు రంగు రంగుల లైట్లను పెడుతూ వుంటారు. అలానే కలర్ ఫుల్ బొమ్మలతో అలంకరిస్తూ వుంటారు.

క్రిస్మస్ ట్రీని కూడా ఎంతో అందంగా ఏర్పాటు చేస్తూ వుంటారు. అయితే ఈ అలంకరణలో ఎక్కువగా ఎరుపు రంగుని వాడుతూ వుంటారు. అలానే గ్రీన్, వైట్, గోల్డ్ కలర్స్ ని కూడా వాడతారు. మరి ఎక్కువగా రెడ్ కలర్ కి ప్రాముఖ్యత ఎందుకు ఇస్తారు..? ఈ విషయానికి వస్తే.. దీన్ని ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. అలానే ఏసుక్రీస్తు ప్రభువు రక్తాన్ని ఇది సూచిస్తుంది. అందుకే ఎరుపు రంగుని వాడతారు. శాంటా తాత కూడా ఎరుపు రంగులోని దుస్తుల్లో కనపడతారు.

ఏసు ప్రభువు శాశ్వత జీవితానికి ప్రతీకగా గ్రీన్ కలర్లో ఉండే ట్రీ ని భావించడం జరుగుతుంది. ప్రజల గుండెల్లో ఇంకా సజీవంగా ఉన్నారని ఆకుపచ్చ రంగు సూచిస్తుంది. అలానే శీతాకాలంలో మంచు ఎక్కువగా కురుస్తుంది. మంచు తెలుపు రంగులో ఉంటుంది కదా..? ఇది స్వచ్ఛతను సూచిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version