ఈ చిట్కాలతో మొటిమలకు చెక్!

-

అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ మొహం మీద మొటిమలు అందానికి మచ్చల ఉంటాయ్. మొటిమలు సాధారణంగా 12 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల వారికి వస్తూ ఉంటాయి. మొటిమలు స్వేద గ్రంధుల కు సంబంధించిన ఒక చర్మ వ్యాధి. దాదాపు 70 నుంచి 80 శాతం మంది యువతీ యువకులలో ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. హార్మోన్ల అసమతుల్యత వల్ల సబేసియస్ గ్రంధులు నుంచి సెబమ్ ఉత్పత్తి కావడం వల్ల మొటిమలు అధికమవుతాయి. అమ్మాయిలలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా మొటిమలను నివారించి అందమైన చర్మం మీ సొంతం చేసుకోవచ్చు. మరి ఆ జాగ్రత్తలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

గోరువెచ్చని నీటితో ముఖాన్ని రోజుకు 4 నుంచి 6 సార్లు శుభ్రం చేసుకోవాలి. రసాయనాలు ఉపయోగించి తయారు చేసిన సబ్బులు, ఫేస్ వాష్ లను అసలు ఉపయోగించకూడదు. సబ్బుతో కాకుండా సున్నిపిండితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం ఎంతో మంచిది.

అంతే కాకుండా తాజాగా ఉండే పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవాలి. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను అసలు తినకూడదు. పడుకునే ముందు మేకప్ మొత్తం క్లీన్ చేసుకుని పడుకోవాలి. అంతేకాకుండా తలగడను రోజు మారుస్తూ ఉండాలి లేదా శుభ్రంగా ఉంచుకోవాలి.

తలలో చుండ్రు లేకుండా, మన తలకు సరిపడా షాంపులను వాడాలి. మన చర్మం జిడ్డు స్వభావం కలిగి ఉంటే నూనె కొవ్వు పదార్థాలను తినడం మానేయాలి. ప్రతిరోజు వ్యాయామం చేయాలి. మొటిమలను గిల్లడం, గోకడం వంటివి చేయకూడదు. గట్టిగా తువ్వాలుతో మొహాన్ని రుద్దకూడదు. మొహానికి తుడుచుకునే టవల్ ను శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఒకే టవల్ ను ఎక్కువరోజులు వాడకూడదు.

రోజు ఎక్కువ నీరు తాగాలి. స్వీట్స్, కూల్ డ్రింక్స్, ఆయిల్ ఎక్కువగా ఉన్నా ఆహార పదార్థాలను వీలైనంత వరకు దూరంగా ఉంచాలి. ప్రకృతి సిద్ధమైన ఆహారం తీసుకొని కేలరీలు తక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలను పాటించటం ద్వారా మొటిమల సమస్యలను అధిగమించవచ్చు. అంతేకాకుండా అందమైన చర్మం మీ సొంతమవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news