కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కాళ్ల‌కు దండం పెట్టిన ఫ్యాన్ ….. వీడియో వైర‌ల్

-

తొలి టెస్ట్ లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో ఈరోజు టీం ఇండియా ఇంగ్లాండ్ తో తలపడుతుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న జరిగింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్ ముగిసిన త‌రువాత  ఓపెన‌ర్లుగా రోహిత్ శ‌ర్మ‌, య‌శ‌స్వి జైస్వాల్ క్రీజులో వ‌చ్చారు. వారు ఇన్నింగ్స్‌ను ఆరంభించేందుకు సిద్ధం అవుతున్న స‌మ‌యంలో సెక్యూరిటీ సిబ్బంది క‌ళ్లు గ‌ప్పిన ఓ అభిమాని స్టేడియంలోకి దూసుకువ‌చ్చాడు.విరాట్ కోహ్లీ పేరు ఉన్న జెర్సీ ధ‌రించిన ఓ అభిమాని క్రీజులో ఉన్న రోహిత్ శ‌ర్మ వద్ద‌కు వ‌చ్చి అత‌డు కాళ్ల‌కు దండం పెట్టాడు.వెంట‌నే హిట్ మ్యాన్ అత‌డిని అలా చేయ‌కూడ‌ద‌ని చెప్పి కౌగిలించుకున్నాడు. సిబ్బంది అక్క‌డ‌కు వ‌చ్చి ఆ అభిమానిని అక్కడ నుంచి తీసుకువెళ్లారు.ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 246 ప‌రుగుల‌కు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా 119/1 పరుగులు చేయగా, ప్రస్తుతం క్రీజులో యజస్వి జైస్వాల్, గిల్ ఉన్నారు .

Read more RELATED
Recommended to you

Exit mobile version