జనవరి 22న నేషనల్ హాలిడే….. ప్రధానికి న్యాయవాది లేఖ

-

ప్రతి భారతీయుడు జనవరి 22 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఈ రోజున రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరవుతారు. వివిధ పార్టీలకు చెందిన అగ్ర రాజకీయ నేతలు, వ్యాపార దిగ్గజాలు, సినీ ప్రముఖులకు కూడా ఈ వేడుకకు ఆహ్వానం పలికారు. చాలా రాష్ట్రాల్లో జనవరి 22ని ‘డ్రై డే’గా ప్రకటించారు. ఒక న్యాయవాది భారత రాష్ట్రపతికి లేఖ రాశారు. జనవరి 22 ను జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని కోరారు.

ఘన్‌శ్యామ్ ఉపాధ్యాయ అనే న్యాయవాది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు ఈ మేరకు లేఖ రాశారు. తన లేఖలో, భగవంతుడు శ్రీరాముడు సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడి శ్వాసలో నివసిస్తున్నాడని, అందువల్ల దేశ ప్రజల మనోభావాలను గౌరవించేందుకు జనవరి 22ని జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలోని ఏ నాగరికతలోనైనా భగవంతుడు శ్రీరాముడి వంటి వ్యక్తి ఈ గ్రహం మీద జన్మించలేదు అని లేఖలో పేర్కొన్నారు.మధ్యప్రదేశ్ ,ఛత్తీస్‌గఢ్‌లు, ఉత్తరప్రదేశ్, గోవా, హర్యానా ప్రాణ్ ప్రతిష్ఠ రోజున పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version