నిరుద్యోగులకు శుభవార్త… టెట్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

-

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.డీఎస్సీ-2024 కంటే ముందుగానే టెట్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం విద్యా శాఖ కమిషనర్‌కు గురువారం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 3 లక్షల మంది అభ్యర్థులకు డీఎస్సీ రాసే వీలు కలగనుంది.11,062 టీచర్ పోస్టులతో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 5089 పోస్టుల భర్తీకి గతేడాది సెప్టెంబర్లో ఇచ్చిన నోటిఫికేషనన్ను రేవంత్ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.

గతంలో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు.మార్చి 4వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అయితే.. టెట్‌ నిర్వహించిన తర్వాతనే డీఎస్సీ నిర్వహించాలని డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన నిరుద్యోగులతో పాటు బీఆర్ఎస్‌ నాయకులు కూడా టెట్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version