రామ మందిర్ నిర్మాణానికి ఆన్ లైన్ లో విరాళాలిచ్చే వారు ఈ విషయాలు తెలుసుకోండి..

-

ప్రతీదీ ఆన్ లైన్ అయిపోయిన కారణంగా సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. మంచి చేద్దామని చెడు ఎదురు అవుతుండడంతో ప్రజలు బెంబేలు పడుతున్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం విరాళాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. దీని కోసం ఆన్ లైన్లోనూ విరాళాలు సేకరిస్తున్నారు. రామ మందిరం పేరుతో రిజిస్టర్ చేసుకున్న వెబ్ సైట్ కి లాగిన్ అయ్యి, ఇక్కడ విరాళాలు ఇవ్వవచ్చు. ఐతే ఇదే అదునుగా చేసుకుని సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోతున్నారు.

రామ మందిరం ఏర్పాటు చేసుకున్న పేరుతో వెబ్ సైట్ రూపొందించి, విరాళాలకి అడ్డు తగులుతున్నారు. దేవుడికి వెళ్ళాల్సిన డబ్బులు తమ జేబుల్లో నింపుకోవడానికి ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఉదంతాలు అయోధ్యలో జరిగాయి. తాజాగా, ముంబై, బిలాస్ పూర్, కాన్పూర్ తదితర ప్రాంతాల్లో కూడా జరిగాయి. అందుకే ఆన్ లైన్ ద్వారా విరాళాలు ఇచ్చేవాళ్ళు జాగ్రత్తగా చెక్ చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news