అన‌గన‌గా ఒక‌ రాజులో న‌వీన్‌కు జోడీగా శ్రీ‌లీల‌!

-

హీరో న‌వీన్ పొలిశెట్టి అన‌గ‌న‌గా ఒక రాజు అనే సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టి కే ఈ సినిమా నుంచి టైటీల్ అనౌన్స్ టీజ‌ర్ విడుద‌ల అయింది. ఈ టీజ‌ర్ న‌వీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్ ను చూపుతూ తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. దీంతో ఈ సినిమా పై అప్ప‌డే అంచ‌నాలు పెరిగాయి. కాగ ఈ సినిమా లో పెళ్లి సంద‌డి ఫేం హీరోయిన్ శ్రీ‌లీల ను చిత్ర బృందం ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. అయితే దీని పై ఇప్ప‌టి వ‌ర‌కు చిత్ర బృందం అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

కానీ అతి త్వ‌ర‌లోనే చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. కాగ అన‌గ‌న‌గా ఒక రాజు సినిమాను క‌ల్యాణ్ శంక‌ర్ దర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అలాగే ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో క‌లిసి సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. కాగ న‌వీన్ పొలిశెట్టి కేరీర్ లో హీరో గా వ‌స్తున్న మూడు చిత్రం ఈ అన‌గ‌న‌గా ఒక రాజు. గ‌తంలో ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌, జాతిర‌త్నాలు ఇండ‌స్ట్రీ హిట్ కొట్టిన విష‌యం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version