కుమారీ ఆంటీకి మద్దతుగా టాలీవుడ్ హీరో సందీప్ కిషన్

-

కుమారి ఆంటీ…. యూటూబ్ ఫుడ్ వ్లాగర్స్ పుణ్యమా అని ఈ పేరు ఈ మధ్యన సోషల్ మీడియాలో విపరీతంగా మారుమోగుతుంది.మీది మెుత్తం 1000 అయింది. రెండు లివర్లు ఎక్స్‌ట్రా’ అంటూ తెగ వైరల్ అయింది. సోషల్ మీడియాలో ఫుడ్ సెంటర్ వైరల్ కావడంతో పెద్ద ఎత్తున జనాలు ఆమె వద్దకు వస్తున్నారు.

అయితే సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోన్న స్ట్రీట్ ఫుడ్ స్టాల్ ఓనర్ కుమారీ ఆంటీకి టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ మద్దతుగా నిలిచారు. సొంతంగా వ్యాపారం చేసి కుటుంబానికి అండగా నిలవాలనుకునే మహిళలకు ఆమె స్ఫూర్తి అని ట్వీట్ చేశారు. బలమైన మహిళా సాధికారతకు ఆమె ఉదాహరణగా నిలిచారన్నారు. సాధ్యమైనంత వరకు ఆమెకు సాయం చేసేందుకు తాను ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. కాగా ఇటీవల సందీప్ కిషన్ ఆమె ఫుడ్ స్టాల్ ను సందర్శించారు.టేస్టీ వెజ్‌, నాన్‌వెజ్‌ వంటకాలను అందిస్తూ ఆమె మంచి పేరు సంపాదించారు. ఐదు కేజీల రైస్ తో మొదలైన ఆమె ప్రయాణం తాజాగా 100 కేజీల రైస్ కు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version