చిరంజీవి , వెంకయ్య నాయుడుల ఆత్మీయ సత్కారం…

-

రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవికి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కి భారతదేశ రెండో అత్యున్నత అవార్డు పద్మవిభూషణ్ ప్రకటించింది. పద్మ విభీషణ్ అవార్డు రావడంతో ఇటు చిరంజీవికి , అటు వెంకయ్య నాయుడు కి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

 

ఈ నేపథ్యంలో…మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. పద్మ విభూషణ్ పురస్కారం వరించిన సందర్భంగా ఆయన ఇంటికి వెళ్లి చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరూ కలిసి కాసేపు ఆత్మీయంగా ముచ్చటించుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవిని వెంకయ్య సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. గతంలో పద్మ భూషణ్ అవార్డు పొందిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా పద్మ విభూషణ్ అవార్డును అందుకోనున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version