పాలసముద్రం వద్ద నాసిన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ …..

-

శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నాసిన్ కేంద్రాన్ని ప్రధాని మోడీ అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్,గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఐఆర్ఎస్ కు ఎంపికైన అభ్యర్థులతో ముచ్చటించారు.ఐఆర్ఎస్ శిక్షణ కోసం రూ.1500 కోట్లతో 503 ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వం భవనాల నిర్మాణం చేపట్టింది. ఇప్పటి వరకు హర్యానాలో మాత్రమే నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ కేంద్రం ఉండేది.

అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. చారిత్రక ప్రదేశంలో నాసిన్‌ ఏర్పాటు చేయడం ఆనందకరంగా ఉందని తెలిపారు. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ట కోసం 11 రోజుల అనుష్టానం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. మరోవైపు. లేపాక్షిలో వీరభద్ర మందిరం,పుట్టపర్తి సత్యసాయిబాబ జన్మస్థలం దర్శించుకోవడం ఆనందంగా ఉందని ప్రధాని మోడీ తెలిపారు. రామరాజ్య భావన నిజమైన భావన అని,ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజలకు సేవకులు అని ఆయన అన్నారు. గతంలో ఉన్న పన్నుల విధానం ప్రజలకు అర్థం అయ్యేది కాదని, జీఎస్టీ మాత్రం అందరికీ అర్థమయ్యే విధంగా ఉందని తెలిపారు. క్యూస్షన్ వర్క్ లేదని ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులను వారి సంక్షేమానికి ఉపయోగించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version