పెయింటర్‌గా మారిని ఎంఎస్‌ ధోని

-

స్టేడియంలు అన్ని ఐపీఎల్ కు సిద్దమవుతున్నాయి. 2019 త‌ర్వాత తొలిసారి మ‌ళ్లీ చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. మార్చి 31 నుంచి ఐపీఎల్ 2023 మ్యాచుల్లో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అన్ని జట్లు ప్రాక్టీస్ మొదలుపెట్టేశాయి. అటు చెన్నై కూడా ప్రాక్టీస్ మొదలు పెట్టింది. కెప్టెన్ ధోనికిది చివరి ఐపీఎల్ కావడంతో..ఎలాగైనా టైటిల్ సాధించి..ధోనికి ఘనమైన వీడ్కోలు పలకాలని చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్స్ అనుకుంటున్నారు. అయితే ప్రాక్టీస్ లో భాగంగా ఎంఎస్ ధోని కాసేపు ఎంఏ చిదంబరం స్టేడియంలో గడిపారు. స్టేడియంలో కుర్చీలకు పెయింటింగ్ వేశారు ఎం ఎస్ ధోని. కుర్చీలకు బ్లూ, పసుపు రంగులు వేశాడు.

కలర్ క్యాన్లతో కుర్చీలకు ధోని రంగుల వేస్తున్న వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ ట్విట్టర్లో షేర్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయింది. ఈ వీడియోకు అతి త‌క్కువ స‌మ‌యంలోనే మూడు ల‌క్షలకు పైగా వ్యూస్ రావడం విశేషం. సుమారు 20 వేల మందికి పైగా లైక్ చేశారు. . చిదంబ‌రం స్టేడియంలో ఏప్రిల్ 3వ తేదీన తొలి మ్యాచ్ జరగనుంది. అయితే టోర్నీ తొలి మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌తో చెన్నై తలపడనుంది. చిదంబ‌రం స్టేడియంలో ల‌క్నో జ‌ట్టుతో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version