‘బేబీ’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసిన రష్మిక

-

విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం బేబి . హృదయ కాలేయం ఫేం సాయిరాజేశ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. వైష్ణవి చైతన్య ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుంచి ప్రేమిస్తున్నా అంటూ సాగే మూడో సాంగ్‌ అప్‌డేట్ అందించిన విషయం తెలిసిందే. ఈ అప్‌డేట్ ప్రకారం ప్రేమిస్తున్నా లిరికల్ వీడియో సాంగ్‌ను రష్మిక మందన్నా రిలీజ్ చేసింది. కొంతసేపటి క్రితం ఈ సినిమాకి సంబంధించిన సాంగ్ లాంచ్ ఈవెంట్, హైదరాబాద్ – పీవీఆర్ ఆర్కే సినీ ప్లెక్స్ – స్క్రీన్ 1లో జరిగింది.

Rashmika Released Lyrical Song From Baby Movie - Sakshi

‘ప్రేమిస్తున్నా … ప్రేమిస్తున్నా .. నీ ప్రేమలో జీవిస్తున్నా’ అంటూ ఈ పాట సాగుతోంది. విజయ్ బుల్గనిన్ స్వరపరిచిన ఈ పాటకి సురేశ్ బానిశెట్టి సాహిత్యాన్ని అందించగా, రోహిత్ ఆలపించాడు. రొమాంటిక్ కామెడీ డ్రామా నేపథ్యంలో నడిచే ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news