ఆదాయపు పన్ను పోర్టల్‌లో పాస్‌వర్డ్‌ మరచిపోతే ఇలా చెయ్యండి…!

-

ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మీ ఐటీ రిటర్న్‌ను ఫైల్ చెయ్యడానికి డిసెంబర్‌ 31 వరకు గడువు ఉంది. కనుక ఈలోగా ఫైల్ చేసేయాలి. లేదంటే పెనాల్టీ పడుతుంది. రిటర్న్‌ దాఖలు చేసేవారి ఆదాయపు పన్ను పోర్టల్‌ పాస్‌వర్డ్‌ మార్చిపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకనే ఎలాంటి టెన్షన్‌ పడకుండా పాస్‌వర్డ్‌ను రిసెట్‌ చేసుకోవచ్చు. అయితే ఆధార్‌తో నమోదు చేయబడిని మొబైల్‌ నెంబర్‌ ఉండాలి.

 

ఆధార్ ఓటీపీ ద్వారా ఇలా పాస్ వర్డ్ మార్చుకోండి:

ఇ-ఫైలింగ్‌ హోమ్‌ పేజీలోకి వెళ్లి లాగిన్‌ అవ్వాలి.
నెక్స్ట్ మీ ఐడీ నెంబర్‌ను నమోదు చేసి… లాగిన్‌ స్క్రీన్‌లో ఫర్‌గిట్‌ పాస్‌వర్డ్‌ మీద క్లిక్ చేయండి.
యూజర్‌ ఐడీని నమోదు చేయాలి. పాస్‌వర్డ్‌ రీసెట్‌ ని సెలెక్ట్ చేసుకోండి.
ఇక్కడ ఆధార్‌ ఓటీపీని ఎంచుకోవాలి. వెరిఫై యువర్‌ ఐడెంటిటీ పేజీలో డిక్లరేషన్‌ చెక్‌ బాక్స్‌ని ఎంచుకుని జనరేట్‌ ఓటీపీ ఆధార్‌పై క్లిక్‌ చేయాలి.
ఓటీపీని నమోదు చేయాలి. కొత్త పాస్‌వర్డ్ను ఎంటర్‌ చేసి కన్ఫర్మ్‌ చేసి సబ్‌మిట్‌పై క్లిక్‌ చేయాలి అంతే.

ఇలా ఓటీపీతో ఈ ఫైలింగ్ చెయ్యండి:

ముందు ఇ-ఫైలింగ్‌ హోమ్‌ పేజీలోకి వెళ్లి లాగిన్‌ కావాలి. మీ ఐడీని నమోదు చెయ్యాలి.
ఇప్పుడు ఫర్‌గిట్‌ పాస్‌వర్డ్‌ను ఎంచుకోవాలి. నెక్స్ట్ ఇ-ఫైలింగ్‌లో ఓటీపీని సెలెక్ట్ చేయాలి.
మీ పుట్టిన తేదీని నమోదు చేయాలి.
రిజిస్టర్డ్‌ ఫోన్‌ నెంబర్‌కు, ఇమెయిల్‌ ఐడికి పంపిన రెండు ఓటీపీలను నమోదు చేసి వెరిఫైపై క్లిక్‌ చేయాలి.
ఫైనల్ గా కొత్త పాస్ వర్డ్ ని ఎంటర్ చేసి సబ్‌మిట్‌పై క్లిక్‌ చేయాలి.

డిజిటల్‌ సిగ్నేచర్‌ సర్టిఫికేట్‌ తో ఇలా చెయ్యండి:

ఇ-ఫైలింగ్‌ లాగిన్‌ కావాలి. నెక్స్ట్ ఐడీని నమోదు చేసి కొనసాగించాలి.
ఫర్‌గిట్‌ పాస్‌వర్డ్‌పై క్లిక్‌ చేయాలి. ఇప్పుడు డిజిటల్‌ సిగ్నేచర్‌ సర్టిఫికేట్‌ను ఎంచుకోవాలి.
సెట్‌ న్యూ పాస్‌వర్డ్‌లో కొత్త పాస్‌వర్డ్‌ను ఎంటర్ చెయ్యండి అంతే.

Read more RELATED
Recommended to you

Exit mobile version