హస్తంలో కుస్తీ: రేవంత్‌కు యాంటీగా ఆ ముగ్గురు!  

-

టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి యాంటీగా సొంత పార్టీలో చాలామందే ఉన్నారు. అసలు ఆయనకు పి‌సి‌సి పదవి వస్తే చాలామంది వ్యతిరేకించారు..అలాగే బహిరంగంగా విమర్శలు చేశారు. అయితే నిదానంగా అందరి నేతలతో సఖ్యత పెంచుకుంటూ రేవంత్ పనిచేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే కొంతవరకు వ్యతిరేకించే వారు తగ్గారు. అలా అని రేవంత్ కు వ్యతిరేకంగా ఉన్నవారు ఇంకా ఉన్నారు కూడా.

ఎప్పటికప్పుడు వారు రేవంత్ రెడ్డికి యాంటీగా ముందుకెళుతూనే ఉన్నారు. ఇక తాజాగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నా పరిణామాలని గమనిస్తే…ఓ ముగ్గురు సీనియర్లు మాత్రం రేవంత్ రెడ్డికి యాంటీగానే వెళుతున్నారు…ఆయన నిర్ణయాలని వ్యతిరేకిస్తున్నారు. మామూలుగానే జగ్గారెడ్డి..రేవంత్ పై దూకుడుగా వెళుతున్న విషయం తెలిసిందే. మొదట నుంచి ఆయన రేవంత్ ని వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. ఇటీవల ఆయనపై తీవ్ర స్థాయిలో కూడా ఫైర్ అయ్యారు..అలాగే దసరాకు సంచలన నిర్ణయం ప్రకటిస్తానని చెప్పి సైలెంట్ అయ్యారు. అయినా సరే ఈయన…రేవంత్ రెడ్డికి యాంటీగానే ముందుకెళుతున్నారు.

ఇక పి‌సి‌సి పదవి ఆశించి భంగపడ్డ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం..మొదట నుంచి రేవంత్ రెడ్డిపై గుర్రుగానే ఉన్నారు. రేవంత్ నిర్ణయాలని ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఆ మధ్య నల్గొండ జిల్లా రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని కూడా వార్నింగ్ ఇచ్చారు. తాజాగా జడ్చర్ల సీటు విషయంలో కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. జడ్చర్ల సీటు తన సన్నిహితుడు అనిరుధ్ రెడ్డికి దక్కేలా చేస్తానని చెప్పారు.

ఇటీవల ఎర్రశేఖర్ పార్టీలో చేరిన నేపథ్యంలో కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో శేఖర్ టీడీపీలో ఉండగా జడ్చర్ల ఎమ్మెల్యేగా పలుమార్లు గెలిచారు. ఇక తర్వాత బీజేపీలోకి వెళ్ళిన ఆయన..తాజాగా కాంగ్రెస్ లోకి వచ్చారు. రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో శేఖర్ కాంగ్రెస్ లోకి వచ్చారు…అలాగే ఈయనకే జడ్చర్ల సీటు దక్కుతుందని ప్రచారం జరిగింది…ఈ క్రమంలోనే కోమటిరెడ్డి..తన సన్నిహితుడు అనిరుధ్ కు టికెట్ దక్కించుకోవాలని చూస్తున్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీలో ఓబీసీ ఛైర్మన్ విషయంలో రేవంత్, దామోదర రాజనరసింహల మధ్య పోరు నడుస్తోంది. ఇప్పుడు ఛైర్మన్ గా ఉన్న నూతి శ్రీకాంత్ ని మార్చి..గాలి అనిల్ కుమార్ ని పెట్టాలని రేవంత్ ఛూస్తున్నారు…కానీ దీనికి దామోదర ఒప్పుకోవడం లేదు. ఇలా ముగ్గురు నేతలు ప్రస్తుతం..రేవంత్ రెడ్డికి యాంటీగానే వెళుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news