ఆంధ్రావనిలో పది ఫలితాలు విడుదలయిన రోజు నుంచి వివాదాలు రేగుతున్నాయి. అరవై ఏడు శాతం మాత్రమే పాస్ పర్సంటేజ్ ఉండడంతో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులు ఫెయిల్ కావడంతో విపక్షాలు తమదైన శైలిలో దీన్నొక రాజకీయాస్త్రంగా వాడుకోవాలని చూస్తున్నాయి. ఈ క్రమంలో అసలు విపక్ష, స్వపక్ష వాదనలు ఎలా ఉన్నా పది ఫలితంకు సంబంధించి కొన్ని కారణాలు చూద్దాం.
మొదటి కారణం : లాంగ్వేజ్ హిట్ గ్రూప్ ఫట్ :
ప్రస్తుతం అంతటా వినిపిస్తున్న మాట ఇది. అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీషులో పాస్ అయిన వారు..మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టులలో తప్పారని ! ఇది చాలా వరకూ నిజం కానీ పేపర్ ప్యాట్రన్ ను పరిశీలిస్తే లాంగ్వేజ్ పేపర్-కు బిట్ ఉంది. అయితే ఇది వేరుగా కాకుండా మెయిన్ పేపర్లోనే ఇంక్లూడ్ అయి ఉంది. కానీ గ్రూపు పేపర్-కు ఒన్ మార్క్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తప్ప ఏమీ లేవు. ముఖ్యంగా గ్రూప్ పేపర్లో కూడా సోషల్ పేపర్ టఫ్ గా ఉంది. అదేవిధంగా మ్యాథ్స్ కూడా ! గతంలో మాదిరిగా కాకుండా పేపర్ ప్యాట్రన్‌ను పూర్తిగా మార్చేశారు. గతంలో రెండు పేపర్లు ఉండేవి. (హిందీ తప్ప ).. 15 మార్కుల చొప్పున ముప్పై మార్కులకు బిట్ పేపర్ వేరుగా ఉండేది. అదేవిధంగా సోషల్ కు మ్యాప్ పాయింటింగ్ ఉండేది. కానీ ఇప్పుడు సిస్టమ్ మారిపోయింది. పేపర్ మారిపోయింది. ప్రశ్నకు అనుగుణంగా జవాబు రాసినా, అనుబంధంగా ఉన్న విషయాలు జోడించి రాసినా కూడా మార్కులు ఇవ్వాలి. ముఖ్యంగా ఇక్కడ అప్లికబులిటీ అన్నది ముఖ్యం. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ క్వశ్చన్లు ఉన్నాయి. పేపర్-కు ఛాయిస్ తక్కువ. ఉన్నా కూడా అది ఇంటర్నల్ ఛాయిస్. ఇదే ఇప్పుడు విద్యార్థులకు సవాలు. చిన్న, చిన్న తప్పిదాలకు కూడా మార్కులు పోయే అవకాశాలే ఎక్కువ. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుంటే ఓ సగటు విద్యార్థి లేదా మోస్తరుగా చదివే విద్యార్థి కి మ్యాథ్స్ పేపర్ కానీ సోషల్ పేపర్ కానీ అటెమ్ట్ చేయడం కష్టం. ఎందుకంటే ఫౌండేషన్ బాగుంటే మిగతా చదువు బాగుంటుంది. కానీ ఇక్కడ ఫౌండేషన్ ను మెరుగు పరిచేందుకు కొందరు టీచర్లు ప్రయత్నించినా విద్యార్థి ఆసక్తి తక్కువ.
రెండో కారణం : లెర్నింగ్ తగ్గిపోయింది..
గతం కన్నా ఇప్పుడు నేర్చుకోవాలన్న యావ తగ్గిపోయింది. ప్రభుత్వ బడులకు ఇవాళ అనేక సవాళ్లు ఉన్నాయి. టీచర్-కు పాఠం కన్నా తరగతి బయట పనులనే ఎక్కువగా ప్రభుత్వం అప్పగిస్తోంది. ఒకప్పుడు మాదిరిగా ఇప్పుడు యూనిట్ టెస్టులు కానీ క్వార్టర్లీ కానీ ఆఫ్యర్లీ కానీ లేవు. పరీక్షల సిస్టమ్ పూర్తిగా మార్చేశారు. ఆ విధంగా విద్యార్థి సాధించేది ఏమీ ఉండడం లేదు.
ముందుగా చదువు నేర్చుకోవాలన్న ఆలోచనల్లో ఇవాళ విద్యార్థులు లేరు. గురువులు అంటే గౌరవం కూడా లేదు వాళ్లకు. సీసీఈ అనే పద్ధతిలో పరీక్షలు పెడుతున్నారు. ఇవి ఏ మాత్రం ఉపయోగపడేవి కావు అని ఉపాధ్యాయులు గగ్గోలు పెడుతున్నారు. అసలు ఇప్పుడు ఇచ్చిన పరీక్ష పేపర్ మోడల్ అస్సలు బాలేదు అని వారంతా వాపోతున్నారు.
ముందుగా చదువు నేర్చుకోవాలన్న ఆలోచనల్లో ఇవాళ విద్యార్థులు లేరు. గురువులు అంటే గౌరవం కూడా లేదు వాళ్లకు. సీసీఈ అనే పద్ధతిలో పరీక్షలు పెడుతున్నారు. ఇవి ఏ మాత్రం ఉపయోగపడేవి కావు అని ఉపాధ్యాయులు గగ్గోలు పెడుతున్నారు. అసలు ఇప్పుడు ఇచ్చిన పరీక్ష పేపర్ మోడల్ అస్సలు బాలేదు అని వారంతా వాపోతున్నారు.
మూడో కారణం : తల్లిదండ్రులకు లేని బాధ్యత
మరి ! గురువులకు ఎందుకు ?
ఒకప్పుడు చదువుల విషయమై తల్లిదండ్రులు బాధ్యత తీసుకునే వారు కానీ ఇప్పుడు అదేం లేదు. అమ్మ ఒడి వచ్చాక చదువులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురి అయ్యాయి. అమ్మ ఒడి వస్తుందా లేదా అన్నది ముఖ్యం కానీ మా పిల్లలకు చదువు వస్తుందా లేదా అన్నది తల్లిదండ్రులు అడగడం లేదు. జవాబుదారీ తనం లేకుండా ఇవాళ తల్లిదండ్రులు ఉన్నారు.
నాలుగో కారణం : బాధ్యత లేని విద్యార్థులు
బడికి వచ్చినా రాకపోయినా అమ్మ ఒడి వస్తే చాలు అని అనుకునే విద్యార్థులే ఎక్కువ. నేర్చుకుందాం అన్న జిజ్ఞాస రెండేళ్లుగా తగ్గిపోయింది. సరిగ్గా అరగంట ఓ దగ్గరగా కుదురుగా కూర్చొని చదివి, చదివింది చూడకుండా రాసే వాళ్లే తక్కువగా ఉన్నారు. అంత శ్రద్ధ లేనప్పుడు ఇక వాళ్లు ఎప్పుడు పాస్ కాగలరు? చదువులు గతంలో మాదిరిగానే సులువు గా సాగిపోతాయి అని అనుకుని చాలా మంది పరీక్షలు ఉండవులే అన్న ధీమాతో ఉండిపోయారు. ముఖ్యంగా చదువుకు సంబంధించి ఏ పాటి శ్రద్ధ పెట్టమని చెప్పినా ఉపాధ్యాయులపై తిరుగుబాటు చేసిన విద్యార్థులే ఎక్కువ. పాఠశాలకు వచ్చి అటెండెన్స్ పలికి పనికిమాలిన తిరుగుళ్ల కోసం పక్కదోవల్లో బడి బయటకు వెళ్లిన పోయిన వారే ఎక్కువ. ఇలాంటి వారిని తిట్టినా – నో యూజ్ …కొట్టినా – నో యూజ్.
ఆఖరుది అతి ప్రమాదం అయినది
ఐదో కారణం మొబైల్ ఎడిక్షన్ :
కరోనా కారణంగానే మాట్లాడుతున్నారు కానీ అంతకుముందు నుంచి కూడా మొబైల్ ఎడిక్షన్ పిల్లలో పూర్తిగా ఉంది. దాన్నొక వ్యసనంగా మార్చుకున్న పిల్లలను చూసి ఇప్పుడు తల్లిదండ్రులు హడలిపోతున్నారు. టిక్ టాక్ లు చేసుకుంటూ చదువులకు ప్రాధాన్యం ఇవ్వని పిల్లలంతా ఇప్పుడు పదో తరగతి ఎలా పాస్ అవ్వాలా అని తలలు పట్టుకుంటున్న మాట కూడా నిజం.
కనుక తల్లిదండ్రులూ మీరు జాగ్రత్త ! మీతో పాటే మీ పిల్లలూ జాగ్రత్త !
కనుక తల్లిదండ్రులూ మీరు జాగ్రత్త ! మీతో పాటే మీ పిల్లలూ జాగ్రత్త !