5 రాష్ట్రాలు.. 18.34 కోట్ల ఓటర్లు.. 690 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు-సీఈసీ సుశీల్ చంద్ర

-

దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికలకు ఎన్నికల సంబంధించి ఎన్నికల కమీషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఉత్తరాఖండ్లోని 70 స్థానాలకు, మణిపూర్ లోని 60 స్థానాలకు, పంజాబ్ లోని 117 స్థానాలకు, ఉత్తర్ ప్రదేశ్ లోని 403 స్థానాలకు, గోవాలోని 40 స్థానాలకు మొత్తంగా 690 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయని తెలిపారు సీఈసీ సుశీల్ చంద్ర. ఈ రాష్ట్రాల్లో మొత్తంగా 18.34 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. ఐదు రాష్ట్రాల్లో ఈసారి మహిళా ఓటర్ల సంఖ్య పెరిగినట్లు వెల్లడించారు. మొత్తంగా 2,15,369 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.

కోవిడ్ సేఫ్ ఎన్నికలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. ఇప్పటికే ఎన్నికలు జరుగనున్న 5 రాష్ట్రాల  ఆరోగ్య శాఖలతో సమీక్షించామని వెల్లడించారు. 80 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజెన్లు, అనారోగ్యంతో వైకల్యంతో, కోవిడ్ తో బాధపడుతున్న వాళ్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తన ఓటుహక్కును వినియోగించుకోవచ్చని సీఈసీ తెలిపారు. పూర్తిగా కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ ఎన్నికలు జరిపిస్తామని సీఈసీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news