50 ఏళ్ల నాటి చెప్పులు..వేలంలో ఏకంగా..రూ.1.7కోట్లు పలికాయి..!!

-

ఓల్డ్‌ ఈస్‌ గోల్డ్‌ అంటారు..అప్పట్లో ఫోలో అయిన పద్ధతులు, డ్రస్సింగ్‌ విధానాన్ని..ఇప్పుడు ఫ్యాషన్‌ పేరిట మళ్లీ ఫాలో అవుతున్నారు. ఒక్కొక్కటీ మెల్లగా మళ్లీ మనుగడలోకి వస్తున్నాయి. అయితే..ఏళ్ల నాటి వస్తువులను వేలం వేస్తే..అవి ఊహించని రేట్‌కు పోవడం మనం చూసే ఉంటాయి. ఈ మధ్యనే ఓ పాయింట్‌ కూడా వేలంలో కోట్లు పలికింది.. తాజాగా 50 సంవత్సరాల కాలం నాటి ఓ జత పాత చెప్పులు వేలంలో ఏకంగా సుమారు రూ.1.7కోట్లకు అమ్ముడయ్యాయిన కథ వైరల్‌ అవుతోంది.. 1970 దశకంలోని ఈ చెప్పుల కోసం వేలంలో చాలా మంది పోటీ పడ్డారు. జులియెన్స్ ఆక్షన్స్ అనే వేలం సంస్థ దీన్ని నిర్వహించింది. బిర్కెన్‍స్టోక్ అరిజోనా కంపెనీకి చెందిన సాండల్స్ ఈ ఆశ్చర్యపోయే ధర వచ్చింది. అసలు ఈ చెప్పుల ప్రత్యేకత ఏంటి.. అంత ధర ఎందుకు పలికిందంటే..
యాపిల్ సహవ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్‌కు చెందిన చెప్పులే ఇవి. అందుకే వేలంలో ఇవి ఇంత ధర పలికాయి. 1970ల్లో స్టీవ్ జాబ్స్ వీటిని ధరించారట. బిర్కెన్‌స్టాక్ కంపెనీకి చెందిన బ్రౌన్ లెదర్ సాండల్స్ ఇవి. సుమారు 50 సంవత్సరాల క్రితం జాబ్స్ వినియోగించిన ఈ చెప్పులను జులియన్స్ ఆక్షన్స్ ఇటీవల ఆన్‍లైన్ వేలానికి తెచ్చింది. నవంబర్ 11 నుంచి 13 వరకు వేలం జరుగగా.. 218,750 డాలర్లు అంటే రూ.1.77 కోట్లు పలికింది.
స్టీవ్ జాబ్స్ వాడిన బ్రౌన్ కుట్టు లెదర్ బిర్కెన్‌స్టాక్ అరిజోనా సాండల్స్ ఇవి. 1970, 1980ల మధ్య ఈ సాండిల్స్ ను స్టీవ్ జాబ్స్ వాడారు. స్టీవ్ జాబ్స్ తర్వాత ఇవి ఆయన హౌస్ మేనేజర్ మార్క్ షెఫ్ దగ్గర ఇవి ఉండేవట. యాపిల్ కంపెనీ చరిత్రలో ముఖ్యమైన సందర్భాల్లో స్టీవ్ జాబ్స్ ఈ సాండిల్స్ ధరించారని ఆక్షన్ నిర్వహించిన సంస్థ వెల్లడించింది. లాస్ ఆల్టోస్ గ్యారేజ్‍లో యాపిల్ కంప్యూటర్‌ను 1976లో ప్రారంభించిన సమయంలో జాబ్స్ ఈ చెప్పులనే ధరించారట. గతంలోనూ చాలా ఎగ్జిబిషన్లలో ఈ సాండిల్స్ ప్రదర్శనలో పెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version