7th pay commission: ఉద్యోగులకు గుడ్ న్యూస్..డీఏ ఎంత పెరుగుతుందో తెలుసా?

-

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జూలై 1 నుంచి జీతాలు భారీగా పెరగనున్నాయి.ఇప్పటివరకు ఉన్న జీతాలకు డబుల్ అవ్వనున్నాయి.ఎప్పటి నుంచో వాళ్లు ఎదురు చూస్తున్న డీఏ జులై 1 నుంచి పెరగనుంది. ఏడో వేతన సంఘం సిఫారసు ప్రకారం.. డీఏను కేంద్రం పెంచనుంది. ఇప్పటికే డీఏను ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు కేంద్రం పెంచింది. నిజానికి డీఏను ప్రతి సంవత్సరం జనవరి, జులైలో ప్రభుత్వం సవరిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకొని డీఏను లెక్కిస్తారు. గత మార్చిలోనే డీఏ పెంపుకు కేంద్రం ఆమోదం తెలిపింది.

ప్రస్తుతం డీఏ శాతం 34 గా ఉంది. వచ్చే నెలలో మరో 5 శాతాన్ని పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. 34 శాతం నుంచి 5 పెంచితే.. 39 శాతం డీఏ పెరగనుంది. 39 శాతం డీఏ ఉంటే.. 18 వేల బేసిక్ శాలరీ ఉన్న ఉద్యోగులకు రూ.7020 డీఏ లభిస్తుంది. ప్రస్తుతం 39 శాతానికి డీఏను పెంచడంతో పాటు కరోనా వల్ల ఆగిపోయిన డీఏ బకాయిలను కూడా కేంద్రం వచ్చే నెల జీతంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల అకౌంట్ లో వేయనున్నట్టు తెలుస్తోంది..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 18 నెలల డీఏ బకాయిలు సుమారు రూ.2 లక్షలను వాళ్ల బ్యాంక్ అకౌంట్ లో వేసేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది. దీని వల్ల.. 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. అలాగే.. 65 లక్షల మంది పెన్షనర్లకు డీఏ పెరగనుంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం రేటు 7.04 శాతంగా ఉంది.అందుకే ఇటీవల డీఏను మొత్తంగా 39 శాతానికి చేయనున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news