ఇంగ్లాండులో అద్భుతమైన ప్రేమకథ ఈ మధ్యనే బయటికి వచ్చింది. అది ఏమిటంటే 1963 లో న్యూ పోర్ట్ లోని సెయింట్ మెరిన్ హాస్పిటల్ లో నర్సులుగా పనిచేసే ఇద్దరు టీనేజర్స్ ప్రేమలో పడ్డారు. వారు లెన్ (19), జీనెట్(18). అయితే, వీరిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు.
కానీ, జీనెట్ తల్లితండ్రులు వీల్ల పెళ్లికి ఒప్పుకోలేదు పైగా జీనెట్ టీనేజర్ కావడంతో వీల్ల పెళ్లి ఆగిపోయింది. అయితే, వీరిద్దరూ కాలానుగుణంగా వేరు వేరు వ్యక్తులతో పెళ్లి చేసుకొని లేన్ ఇంగ్లాండ్ లో జీనెట్ ఆస్ట్రేలియాలో స్థిరపడిపోయారు. 60 ఏళ్ల తరువాత లేన్ ఆస్ట్రేలియా నుండి ప్రియరాలను వెతుక్కుంటూ ఇంగ్లాండ్ కు వచ్చి ప్రియారాలను కలసి ఆమెను ఒప్పించి వివాహము అడాడు. ప్రస్తుతం వారి వయసు లేన్ – 79, జీనెట్ – 78.