బిజినెస్ ఐడియా: లక్షల్లో ఆదాయాన్ని ఇచ్చే వ్యాపారం.. పైగా ప్రభుత్వ సబ్సిడీ..

-

బిజినెస్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారా? ఎటువంటి బిజినెస్ చేస్తే మంచి లాభాలు వస్తాయో అనుకుంటున్నారా? ఉద్యోగం కోల్పోయిన చాలా మంది వ్యాపార వైపు అడుగులు వేశారు. అలాంటి వారు చాలా మంది వ్యవసాయాన్ని తమ సంపాదన మార్గంగా చేసుకున్నారు. సంప్రదాయ వ్యవసాయం కాకుండా ఆధునిక వ్యవసాయం చేస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ఇలాంటి వారిలో చాలా మంది ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాల పంటలు, పువ్వులు మొదలైన వాటి సాగు ప్రారంభించి లక్షల రూపాయలు సంపాధించుకుంటున్నారు.

బే ఆకు సాగు కూడా చాలా లాభదాయకమైన వ్యాపారం. కమర్షియల్‌ పద్ధతిలో బే ఆకు సాగు చేస్తే, తక్కువ శ్రమతో, తక్కువ ఖర్చుతో భారీ లాభాలు పొందవచ్చు.ఈ సాగు కు అయ్యే ఖర్చులకు ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుంది. ఈ ఆకు సాగుకు సులభంగా ప్రారంభించవచ్చు. 4 నుంచి 6 మీటర్ల దూరంలో నాణ్యమైన బే ఆకు మొక్కలను నాటాలి. లైన్ నుండి లైన్ మధ్య కూడా తగినంత దూరం ఉంచాలి. క్రమం తప్పకుండా నీటిని అందించాల్సి ఉంటుంది. బే ఆకు మొక్కలు చిన్నగా ఉన్నంత వరకు, మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో కూరగాయలను నాటడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.ప్రభుత్వం ఈ సాగుకు 30 శాతం సబ్సిడీ కూడా అందిస్తుంది.

ఒక బే లీఫ్ మొక్క నుంచి ఏడాదికి 5 వేల వరకూ పొందవచ్చు. మీరు 25 బే మొక్కలను నాటితే, మీరు ఏటా 75 వేల నుండి 1 లక్ష 25 వేల వరకు సంపాదించవచ్చు. ఎక్కువ మొక్కలు నాటితే ఆదాయం పెరుగుతుంది. మీ ఆదాయం మీ మార్కెటింగ్ వ్యూహంపై కూడా ఆధారపడి ఉంటుంది. మీరు మీ ఉత్పత్తిని మధ్యవర్తి లేకుండా విక్రయిస్తే మీకు ఎక్కువ లాభం లభిస్తుంది. మీకు కస్టమర్లు ఎక్కువగా ఉంటే, మీరు ఇతర రైతుల నుంచి ఆకులను తీసుకొని వాటిని మరింత విక్రయించడం ద్వారా మీ వ్యాపారాన్ని పెంచుకోవచ్చు..మరింత ఆదాయాన్ని పెంచుకోవచ్చు..ఇలాంటి బిజినెస్ ఆలోచన ఉంటే మీరు కూడా మొదలు పెట్టండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version