పెళ్లి వేడుకకు వెళ్తుండగా కల్వర్టును ఢీ కొట్టిన కారు.. ఇద్దరు స్పాట్ డెడ్..!!

పెళ్లి వేడుక ప్రయాణం.. ఓ ఇంట విషాదం చోటు చేసుకుంది. కొద్ది సేపటిలో వేడుకకు హాజరయ్యే సమయానికి ప్రమాదం జరగడంతో ఆ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి కల్వర్టును ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Accident
Accident

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణ జిల్లాలోని బాపులపాడు మండలం అంపాపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందన్నారు. కారు అదుపు తప్పి కల్వర్టును ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వివాహ వేడుకకు విజయనగరం వెళ్తుండగా.. ఈ ప్రమాదం సంభవించిందన్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టామన్నారు. మృతదేహాలను మార్చరీకి తరలించామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామన్నారు.