IND VS NZ : గ్రౌండ్‌లోకి దూసుకువచ్చిన బాలుడు.. రోహిత్ శర్మ చెప్పిన ఆ ఒక్క మాటతో..

-

రాయ్ పూర్ వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ పై 8 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. 109 పరుగుల లక్ష్యాన్ని రోహిత్ శర్మ సేన కేవలం 20.1 ఓవర్లలో 2 వికెట్ మాత్రమే నష్టపోయి అందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో రాణించగా..మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ 40 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు.

అయితే, ఈ వన్డేలో ఓ కుర్రాడు హిట్ మ్యాన్ ను కలవడానికి వచ్చి అతడిని గట్టిగా హత్తుకున్నాడు. భారత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జరిగింది ఈ ఘటన. ఇండియా ఇన్నింగ్స్ 10వ ఓవర్ నాలుగో బంతి వేసిన తర్వాత స్టేడియంలో మ్యాచ్ చూడటానికి వచ్చిన ఒక కుర్రాడు అమాంతం పరిగెత్తుకుని వచ్చి నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న హిట్ మ్యాన్ ను హత్తుకున్నాడు.

ఆ క్రమంలో బ్యాలెన్స్ తప్పిన రోహిత్ కింద పడిపోయాడు. కానీ బ్యాట్ సాయంతో దానిని నివారించాడు. అయితే ఆ కుర్రాడితో పాటే పరిగెత్తుకొచ్చిన గ్రౌండ్ సిబ్బంది అతడిని పట్టుకొని లాక్కెళ్తుండగా రోహిత్ వారిని వారించాడు. చిన్నపిల్లడు ఏమనకండి, వదిలేయండి, అని వారికి సూచించాడు. దీంతో వాళ్ళు ఆ కుర్రాడిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version