30 ఏళ్లుగా లాటరీ టికెట్లు కొంటున్న దంపతులు… ఈ ఏటా కల ఫలించింది!

-

ఓ వ్యక్తి అలిగిన తన సతీమణిని సంతోషపరిచేందుకు రెండు లాటరీ టికెట్లు కొన్నాడు. ఆ తరువాత, రెండు టిక్కెట్లకు లాటరీ తగిలింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. అక్కడి న్యూసౌత్ వేల్స్ కు చెందిన ఓ జంట గత 30 ఏళ్లుగా క్రమం తప్పకుండా లాటరీ టికెట్లు కొంటూనేఉన్నారు. భర్త ఇటీవల తన భార్య పేరు మీద లాటరీ టికెట్ కొనుగోలు చేయడం మర్చిపోయాడు. దాంతో ఆమె తన భర్త పై అలిగింది. భార్య అలకబూనిన విషయాన్ని గుర్తించిన ఆ వ్యక్తి… ఈసారి రెండు లాటరీ టికెట్లను భార్య పేరుమీదే కొనుగోలు చేశాడు.

Quarrel with wife and good luck; Become a millionaire in no time; Wife  unconscious as soon

గత సోమవారం లాటరీ ఫలితాలు వచ్చాయి, ఆ రెండు టికెట్లకు లాటరీ తగిలింది. ఒకటి కాదు రెండు కాదు… ఒక్కో టికెట్ కు రూ.8 కోట్ల చొప్పున రెండింటికీ కలిపి మొత్తం రూ.16 కోట్లు లాటరి లో తగిలాయి. ఇక ఆ భార్యాభర్తల ఆనందం అంతాఇంతా కాదు. తమ కుమార్తెకు కొత్త ఇల్లు తీసుకుంటామని, తమ పిల్లల కోసమే కాకుండా, వారి పిల్లలపిల్లల కోసం కూడా లాటరి లో వచ్చిన డబ్బును వినియోగిస్తామని ఆ జంట తెలిపింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news