సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి కీలకమైన పదవి.. ఏమిటంటే..!!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖు నటుడుగా, రచయితగా, డైరెక్టర్గా పేరుపొందారు నటుడు పోసాని కృష్ణ మురళి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా కీలకమైన పదవిని అప్పగించినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించినట్లు సమాచారం. గతంలో పోసాని 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరఫున గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో అటు తరువాత వైసిపి పార్టీలోకి చేరడం జరిగింది. దీంతో ఈ పార్టీకి అనుకూలంగా ఎన్నో సందర్భాలలో మీడియాతో మాట్లాడడం జరిగింది.

ఇక పలుసార్లు ప్రతిపక్ష నేతల పైన తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ నేతల పైన, అధినేత పైన కూడా ఎన్నోసార్లు విమర్శలు చేయడం జరిగింది పోసాని. దీంతో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు పోసాని ఇంటి పైన దాడి చేయడం కూడా గతంలో జరిగింది. దీంతో నటుడు పోసానికి సినిమా అవకాశాలు కూడా తగ్గుతూ వచ్చాయి. అయితే వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నటుడుకి పదవి వస్తుందని ఆశించగా ఎట్టకేలకు ఇప్పుడు ఆ పదవి దక్కిందని అభిమానుల సైతం భావిస్తూ ఉన్నారు.

కొంతమంది సినీ ప్రేమికుల సైతం జగన్ కేవలం రాజకీయంగా కొంతమందిని వాడుకొని వదిలేస్తున్నారని అపోహతో ఉండేవారు. ఈ తరుణంలో గడిచిన కొద్ది రోజుల క్రితం కమెడియన్ ఆలీకి ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారులుగా పదవి ఇవ్వగా.. తాజాగా పోసాని కృష్ణ మురళికి ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ పదవిపై పోసాని చాలా సంబరపడిపోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news