టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కాసేపట్లో మీడియా ముందుకు రానున్నారు.. రాత్రి 8 గంటలకు కేసీఆర్ ప్రెస్మీట్ ఉందంటూ.. మీడియాకు సమాచారం ఇచ్చారు.. అయితే, కేసీఆర్ ఏ అంశాలపై మాట్లాడనున్నారు? అనేది మాత్రం ఉత్కంఠగా మారింది… తెలంగాణ రాజకీయాల్లో కాకరేపిన మునుగోడు ఉప ఎన్నికలో కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది.. దీంతో, మునుగోడుపై గులాబీ బాస్ స్పందిస్తారనే ప్రచారం సాగుతోంది.. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం, పోలింగ్ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఇక, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి విక్టరీ కొడతారన్న పక్కా సర్వే రిపోర్ట్ కూడా ఉందట.. దీంతో.. మునుగోడు ఉప ఎన్నికపై కేసీఆర్ స్పందించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Breaking : రాత్రి 8గంటలకు సీఎం కేసీఆర్ కీలక ప్రెస్మీట్
-