టీఆర్ఎస్ పార్టీ 21వ ప్లీనరీకి గులాబీ శ్రేణులు సిద్ధం అయ్యాయి. హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ హెచ్ఐసీసీ వేదిక గులాబీ మయంగా మారింది. నగరంలో ఎక్కడ చూసిన కేసీఆర్, కేటీఆర్ కటౌట్లను ఏర్పాటు చేశారు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు. ప్లీనరీ వేదిక వద్ద పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం 2500 మంది పోలీస్ సిబ్బందితో భద్రతను ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉంటే ప్లీనరీ వేదికగా కేసీఆర్ ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటారో అని తెలంగాణ సమాజం మొత్తం ఎదురుచూస్తోంది. ఉదయం 11 గంటలకు కేసీఆర్ ప్రసంగం ఉండబోతోంది. అయితే ఈ నేపథ్యంలోనే.. టీఆర్ఎస్ పార్టీలో జాతీయ రాజకీయాల వ్యవహారాల కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత నియామకం అయ్యారు. ఈ మేరకు టిఆర్ఎస్ పార్టీ అధికారిక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఎమ్యెల్సీగా కల్వకుంట్ల కవిత పని చేస్తుండగా…. ఇప్పుడు ఈ పదవి ఇచ్చారు.