తెలంగాణలో దారుణం..10 ఏళ్ల బాలుడిపై యువకుడి లైంగిక దాడి

-

దేశంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. ప్రతి రోజు ఏదో ఓ మూలన… మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్ని కఠినమైన నిర్నయాలు, చట్టాలు అమలు చేసినా.. ముర్ఖులకు బుద్ది రావడం లేదు. ఇంకా రెచ్చి పోయే ప్రవర్తి స్తున్నారు. అయితే.. ఇన్ని రోజులు మహిళపై లైంగిక దాడులు చూశాం.. కానీ తాజాగా అభం, శుభం తెలియని 10 ఏళ్ల బాలుడిపై ఓ దుర్మార్గుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఈ సంఘటన తెలంగాణలోని వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలానికి చెందిన ఓ పదేళ్ల బాలుడిని.. అదే గ్రామానికి చెందిన సహదేవుడు అనే యువకుడు.. ఆడుకుందామని.. అక్కడే ఉన్న చెట్ల పొదల్లోకి తీసుకెళ్లాడు.

ఆ చెట్ల పొదల్లో లైంగిక దాడికి బలవంతంగా ప్రయత్నించాడు. దీంతో ఆ బాలుడు అరవడంతో.. నోరు నొక్కేసి.. లైంగిక దాడికి పాల్పడి.. అక్కడి నుంచి పారిపోయాడు. ఇక ఈ విషయాన్ని ఏడుచుకుంటూ.. తన తల్లిదండ్రులకు చెప్పాడు ఆ పదేళ్ల బాలుడు. ఈ విషయం తెలిసిన ఆ తల్లి దండ్రులు… వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సహదేవుడుపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version