కస్టమర్ల డబ్బుతో ఐపీఎల్‌ బెట్టింగ్‌.. పోస్టుమాస్టర్ నిర్వాకం..

-

కొందరు ఈజీ మనీకి అలవాటు పడి.. డబ్బు సంపాదించడానికి చెడుదారులు ఎంచుకుంటున్నారు. అలాంటి ఘటనే ఇది.. కష్టపడి పోస్ట్‌ ఆఫీసులు సొమ్ము దాచుకుంటే.. ఆ సొమ్మును తన ఇష్టానికి వాడుకున్నాడో ప్రబుద్ధుడు. ఈ ఘటన మధ్య ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఓ పోస్టుమాస్ట‌ర్ త‌న పోస్టాఫీసు క‌స్ట‌మ‌ర్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల సొమ్మును దుర్వినియోగం చేశాడు. ఐపీఎల్ బెట్టింగ్ కోసం ఆ డ‌బ్బును వాడిన‌ట్లు సమాచారం. 24 కుటుంబాల‌కు చెందిన సుమారు కోటి రూపాయాల ఎఫ్‌డీల‌ను బెట్టింగ్‌కు వాడిన‌ట్లు విచార‌ణ‌లో తేలింది. సాగ‌ర్ జిల్లాలోని స‌బ్ పోస్టాఫీసులో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

9 Best Cricket Betting App In India: Review, Welcome Bonus, And More -  MobyGeek.com

ఈ నేపథ్యంలో.. బీనా సబ్ పోస్టాఫీసు పోస్టుమాస్ట‌ర్ విశాల్ అహిర్‌వార్‌ను పోలీసులు అరెస్టు చేశౄరు. మే 20వ తేదీన అత‌న్ని బీనా గ‌వ‌ర్న‌మెంట్ రైల్వే పోలీసు అదుపులోకి తీసుకున్నారు. ఆ నేరానికి పాల్ప‌డిన‌ట్లు అత‌ను అంగీక‌రించాడు. క‌స్ట‌మ‌ర్ల‌కు నిజ‌మైన పాస్‌బుక్‌ల‌ను జారీ చేసి.. న‌కిలీ ఎఫ్‌డీ అకౌంట్లు జారీ చేసిన‌ట్లు పోస్టుమాస్ట‌ర్‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. గ‌డిచిన రెండేళ్ల నుంచి ఐపీఎల్ బెట్టింగ్ కోసం ఆ సొమ్మును వాడుతున్న‌ట్లు గుర్తించారు. ఐపీసీలోని 420 చీటింగ్‌, 408 న‌మ్మ‌క‌ద్రోహం కేసుల‌ను రిజిస్ట‌ర్ చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news