పోలీస్ ఇన్ ఫార్మర్ నెపంతో వ్యక్తి దారుణ హత్య.. నోట్ విడుదల!

-

పోలీస్ ఇన్‌ఫార్మర్ నెపంతో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా భైరంగఢ్ పోలీస్‌స్టేషన్ పరిధి లోని కేశముండి పారా గ్రామంలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. మృతుడిని సోడి భద్రుగా గుర్తించారు. అతని ఇంట్లోకి చొరబడిన మావోయిస్టులు గొడ్డలితో అతి కిరాతకంగా నరికి హత్య చేశారు.

ఈ మేరకు సీపీఐ-మావోయిస్ట్ భైరామ్‌గఢ్ ఏరియా కమిటీ పేరుతో ఓ కరపత్రాన్ని అక్కడే వదిలి వెళ్లారు. మృతుడు సాల్వాజడుంలో పని చేస్తూ మావోయిస్టుల ఆచూకీని పోలీసులకు చేరవేస్తున్నాడని అందుకే హతమార్చామని, మావోయిస్టులకు ఎవరు వ్యతిరేకంగా ప్రవర్తించినా ఇదే గతి పడుతుందని ఆ లేఖలో హెచ్చరించారు. విషయం తెలియడంతో భైరాంఘర్ పోలీసులు మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version