ప్రామిస్ ఇస్ ఏ ప్రామిస్.. మృతి చెందిన నేతన్న కుటుంబానికి రూ.6 లక్షల సాయం : కేటీఆర్

-

బీఆర్ఎస్ పార్టీ నేతన్నల కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇటీవల అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన నేతన్న కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించడమే కాకుండా అనాథలుగా మారిన ముగ్గురు పిల్లలకు ఆర్థిక సాయం ప్రకటించారు.

ఆర్డర్లు లేక అప్పుల ఊబిలో కూరుకుపోయిన పవర్ లూమ్ కార్మికులు అమర్, స్రవంతి ఇటీవల ఆత్మహత్య చేసుకోగా.. వారి ముగ్గురు పిల్లలు అనాథలు అయ్యారు.దీంతో వారి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్ రూ.6లక్షల ఆర్థిక సాయం ప్రకటించగా.. 24 గంటల్లో అవి వారి అకౌంట్లో క్రెడిట్ చేయించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కేటీఆర్ పోస్టు చేశారు. ‘BRS పార్టీ గత దశాబ్దంలో నేత కార్మికులకు ఎల్లప్పుడూ మద్దతునిస్తుంది మరియు ప్రోత్సహిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం నిద్ర నుండి మేల్కొనాలి. మరింత మంది నేత కార్మికులు ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడటానికి ముందే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి’ అని రాసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version