తెలంగాణ ప్రజలకు షాక్.. ఆ రేషన్ కార్డులు రద్దు?

-

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో చాలా మంది ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తుండగా, ఇప్పుడు ఉన్న రేషన్ కార్డుల్లో కొందరి పేర్లను తొలగించేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని రేషన్ కార్డులు రద్దు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.ముఖ్యంగా బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకోసం ప్రభుత్వం రేషన్ కార్డు దారులను ఈ-కేవైసీ చేసుకోవాలని పిలుపునిచ్చింది.

ఈ క్రమంలోనే ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 15 లక్షల మంది తెల్ల రేషన్ కార్డులు రద్దు కానున్నట్లు తెలుస్తోంది. E-KYC ప్రక్రియకు వీరంతా హాజరుకాకపోవడంతో ఆ కార్డులను ప్రభుత్వం రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇకపై రేషన్ కార్డుల జారీలో పకడ్బందీగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి నుంచి సిటిజన్-360 డేటా సాయంతో అర్హులైన వారికే కార్డులు మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 89.96 లక్షల మందికి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version