సాధారణంగా మనిషికి ఒక్కసారి గుండెపోటుకు గురైతేనే బతుకుతాడో లేదో చెప్పడం కష్టం. అతి కష్టం మీద ప్రాణాలతో బయటపడతారు. అలాంటిది ఒక వ్కక్తి ఒకేరోజులో 6 సార్లు గుండెపోటుకు గురయ్యాడు. వైద్యులు అతనికి చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. ఇది నిజంగా వైద్యరంగంలోనే మిరాకిల్ కదా.! భారత సంతతికి చెందిన అమెరిన్ విద్యార్థికి ఈ అనుభవం ఎదురైంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
లండన్‌లో చదువుతున్న భారతీయ సంతతికి చెందిన ఓ విద్యార్థి ఒకేరోజు ఆరుసార్లు గుండెపోటులతో బయటపడ్డాడు. 21 ఏళ్ల అతుల్ రావు ఆరుసార్లు గుండెపోటుతో బయటపడ్డాడు. ఈ ఘటన తర్వాత ఈ విద్యార్థి వైద్యరంగంలో చదవాలనుకున్నాడని ఆంగ్ల మీడియా ది ప్రింట్ పేర్కొంది.
లండన్‌లోని సియాటెల్‌లో నివాసముంటున్న అతుల్ రావు టెక్సాస్‌లోని బేలర్ యూనివర్శిటీలో చదువుతున్నాడు. ఇటీవలి కాలంలో ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టడం వల్ల గుండెపోటుతో గుండెకు రక్తప్రసరణ నిలిచిపోయింది. ఊపిరితిత్తుల బ్లాక్ కారణంగా, గుండెకు రక్త ప్రసరణ లేదు, పల్మనరీ ఎంబోలిజం అనే పరిస్థితి ఎదురైంది. ఫలితంగా ఒక రోజులో మొత్తం ఆరు గుండెపోటులు వచ్చాయి.
అతన్ని వెంటనే లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్ హెల్త్‌కేర్ NHS ట్రస్ట్ హామర్స్మిత్ హాస్పిటల్‌లోని కార్డియాక్ సెంటర్‌లో చేర్చారు. ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టడం, గుండెకు రక్తప్రసరణను అడ్డుకున్నట్లు స్కానింగ్‌లో నిర్ధారించారు. దీంతో వెంటనే చికిత్స అందించి కాపాడారు. దీని తరువాత, అతుల్ రావు తన తల్లిదండ్రులతో కలిసి లండన్‌లోని ఈ ఆసుపత్రికి వచ్చి తన ప్రాణాలను కాపాడిన ఆసుపత్రి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సంఘటన జరగడానికి ముందు అతుల్ వైద్య రంగాన్ని ఎంచుకోవాలా లేక వ్యాపార రంగాన్ని ఎంచుకోవాలా అనే సందిగ్ధంలో ఉన్నాడట. దాదాపు వ్యాపార రంగాన్ని ఎంచుకున్నాడు.. కానీ ఇప్పుడు చివరి క్షణంలో తన నిర్ణయాన్ని మార్చుకుని.. ఈ మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాని, నాకు లభించిన రెండవ అవకాశాన్ని ఇతరులకు సహాయం చేయడానికి వెచ్చించాలనుకుంటున్నానని అని అతుల్ రావు పేర్కొన్నారు.