పరశురాముడు..అంటే ఒక మహర్షి..చాలా కోపిష్టి..ముక్కు సూటి మనిషి అని అందరికి తెలుసు.అయితే తన కోపమే తన తల్లిని చంపేలా చేసిందని పెద్దలు అంటున్నారు.కానీ పురాణాలు మాత్రం ఎం చెబుతున్నాయో అనేది చాలా మందికి తెలియదు. ఇప్పుడు అసలు కథ ఏంటో వివరంగా తెలుసుకుందాం..శ్రీ మహా విష్ణువు దశావతారాలలో ఒకటైన పరశురాముని చరిత్ర ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది..ఇతను మహా ఋషి జమదగ్ని, రేణుకల కుమారుడు. ఋషి జమదగ్ని, రేణుకకు మరో నలుగురు కుమారులు కూడా ఉన్నారు. జమదగ్ని ఋషి కోపానికి ప్రసిద్ధి. పరశురాముడు శివుని అనుగ్రహం కోసం తీవ్రమైన తపస్సు చేసి ఒక రకమైన ఆయుధం అందుకున్నాడు.
అతను బ్రాహ్మణుడు అయిన అతని కోపం మాత్రం క్షత్రీయుల మాదిరిగా ఉండేది.అతని తల్లి , తండ్రి ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్నారు. అతని తల్లికి నీటిపై పూర్తి అధికారం ఉంది. అతని తండ్రికి అగ్నిపై అధికారం ఉంది. రేణుక తడి మట్టి కుండలో కూడా నీరు నింపేదని కథలు చెబుతున్నాయి. విషయాన్నికొస్తే.. జమదగ్ని మహర్షి తన భార్య రేణుకను నీల్లు తీసుకురావాలని కోరాడు..నీరు తీసుకువచ్చేందుకు నది దగ్గరికు వచ్చిన ఆమెకు ఒక అందనమైన యువకుడు కనిపించాడు. అతనిని చూసి ఆమె మత్తులోకి జారుకుంది. అతని స్పృహలో తనను తాను కోల్పోయింది. తన భర్త వద్దకు తిరిగి వెళ్లాలని కూడా అనుకోలేదు.
కొంతకాలం తర్వాత తన భర్త వద్దకు వచ్చింది. భార్య చేసిన పని తెలుసుకున్న మహర్షి కోపంతో రగిలి పోయాడు.తన కుమారులకు తల్లిని చంపాలని కోరగా ముగ్గురూ కొడుకులు మాత్రం ఆ పని చేయలేమని వెనక్కి వెళ్లారు.పరశురాముడిని ఈ పనికి ఎంచుకున్నాడు. అంతే కాదు తల్లితో పాటు మిగిలిన నలుగురు సోదరులను కూడా చంపమని ఆ మహర్షి ఆదేశించాడు. పరశురాముడు తండ్రి మాటలకు అంగీకారం తెలిపాడు. పరశురాముడి శక్తి ఎంతటిదో తండ్రికి తెలుసు.
మరోవైపు తన తండ్రి సంతోషంగా ఉన్నప్పుడు తన తల్లి, సోదరులను తిరిగి తీసుకువస్తాడని పరశురాముడు మనసులో భావించాడు..తన ఆయుధంతో స్ తల్లిని , సోదరులను కూడా చంపేసాడు. కొడుకుకు ఒక వరం కోరుకోమని అడిగాడు. మహర్షి శక్తులు తెలిసిన అతను తల్లి , సోదరులను బ్రతికించాలని కోరాడు..అతని కోరిక మేరకు తండ్రి వారి శరీరాలకు ప్రాణం పోశాడు.ఇది అసలు కథ..