రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. రేపటి నుండి ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం అవుతోంది. గత ఏడాది కరోనా మహమ్మారి కారణంగా ఇవి ఆగిపోయాయి. ఇలా కొన్ని రైల్లు నిలిచిపోయిన సంగతి తెలిసినదే. వాటినన్నిటినీ దశల వారీగా రైళ్లను పునరుద్ధరిస్తోంది. స్పెషల్ ట్రైన్స్‌తో పాటు ప్యాసింజర్ రైళ్లను ప్రకటిస్తోంది.
వీటిలో భాగంగా గుంటూరు-కాచిగూడ ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ రైలును కూడా నడపనుంది. అయితే ఇది వారంలో రెండు రోజులు మాత్రమే ఉంటుంది. ఏప్రిల్ 1న రాత్రి 7 గంటలకు గుంటూరులో ఈ రైలు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.45 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.
ఇది ఇలా ఉంటే ఇది దారి లో నరసరావు పేట, వినుకొండ, మార్కాపురం, గిద్దలూరు, నంద్యాల, డోన్, కర్నూలు సిటీ, జోగులాంబ గద్వాల, వనపర్తి రోడ్, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్‌నగర్ రైల్వే స్టేషన్ల లో ఆగుతుంది.
మళ్ళీ ఇది ఏప్రిల్ 2న కాచిగూడలో మధ్యాహ్నం 3.10 గంటలకు స్టార్ట్ అయ్యి మరుసటి రోజు ఉదయం 6.45 గంటలకు గుంటూరు చేరుకుంటుంది. షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, జోగులాంబ గద్వాల, కర్నూలు సిటీ, డోన్, నంద్యాల, గిద్దలూరు, మార్కాపురం, వినుకొండ, నరసరావుపేట లో ఆగుతుంది. ఈ రైలు తో పాటు కొన్ని ప్రత్యేక రైళ్లను కూడా పొడిగించింది.