మీకు తోటపని చేసే అలవాటు ఉందా.. అయితే క్యాన్సర్‌ ముప్పు..

-

చాలామందికి తోటపని చేయడం అంటే ఇష్టం ఉంటుంది.. టైమ్‌ ఉన్నప్పుడు అక్కడే గడిపేస్తారు.. ఎంతైనా ఇంట్లో గార్డెన్‌లా చేసుకుని రకరకరాల మొక్కలు, కూరగాయాలు పెంచుకుంటే ఆ ఆనందమే వేరు.. తోటపని చేయడం వల్ల మనసుకు కూడా హాయిగా అనిపిస్తుంది.. తోటపని చేయడం వలన చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ముప్పు నుంచి కూడా బయటపడవచ్చునని తాజా పరిశోధనలో తేలింది.
ఇటీవల నిర్వహించిన CU బౌల్డర్ పరిశోధన ప్రకారం.. తోటపని వ్యక్తుల శారీరక, మానసిక ఆరోగ్యంపై చాలా ప్రభావాన్ని చూపుతుందని తేలింది.. క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు, ఇతర మానసిక ఆరోగ్య రుగ్మతలను నివారించడంలో కమ్యూనిటీ గార్డెనింగ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని CU బౌల్డర్‌లోని పర్యావరణ అధ్యయనాల విభాగంలో ప్రొఫెసర్ అయిన సీనియర్ జిల్ లిట్ అన్నారు.

పరిశోధన ఎలా జరిగిందంటే..

అమెరికన్ క్యాన్సర్ సొసైటీ తరఫున CU బౌల్డర్‌లోని ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ విభాగం ప్రొఫెసర్ జిల్ లిట్ పరిశోధన చేశారు. 40 ఏళ్లు దాటినప్పటికీ వారిని తీసుకున్నారు.. వారంతా ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండటం గమనించారు. వారంతా తోట పనిచేసే వారు. వారి ఆరోగ్య రహస్యాన్ని తెలుసుకునేందుకు ఆ పరిశోధకురాలు 291 మంది మధ్య వయస్కులను తన అధ్యయనం కోసం వాడుకున్నారు. అందులో సగం మందికి తోటపని అప్పజెప్పగా, మిగతా సగం మందికి వారి మేనేజ్మెంట్ బాధ్యతలు అప్పజెప్పారు. అలా ఒక సంవత్సరం పాటు అధ్యయనం చేయగా, తోటపని చేసే సగం మంది ఆరోగ్యం చాలా మెరుగుపడింది, వారి అనారోగ్య సమస్యలు దూరం అయ్యాయి. క్యాన్సర్ ప్రమాదం కూడా చాలామేరకు తగ్గింది.. అంతేకాకుండా వారిలో ఒత్తిడి, ఆందోళన స్థాయిలు చాలా తగ్గాయి.. ఈ పరిశోధన ఫలితాలు లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

కారణం ఏంటి..?

కమ్యూనిటీ గార్డెనింగ్ ప్రారంభించిన వారిలో శారీరక శ్రమ పెరిగింది. అంతేకాకుండా పరిశోధన కాలంలో ఏడాది పాటు వారు ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవనం సాగించారు. అలాగే వారు పండించిన కూరగాయలు, శాకాహారాన్నే ఎక్కువ తినగలిగారు. అంటే వారి ఆహారంలో ఫైబర్ కంటెంట్ పెరిగిందనమాట… ఈ రకంగా వారికి ఆరోగ్యకరమైన ఆహారం, తోటపని శారీరక శ్రమతో కూడుకున్నది కాబట్టి క్రమం తప్పని వ్యాయామం జరిగింది. ఈ రకంగా వారి శారీరక ఆరోగ్యం గాడినపడింది…

Read more RELATED
Recommended to you

Latest news