ప్రస్తుతం ఏపీలో టిడిపి మరియు వైసీపీ పార్టీల మధ్యన మాటల యుద్ధం జరుగుతోంది. అధికారంలో ఉన్న వైసీపీ మళ్లీ అధికారంలో రావడానికి తగిన వనరులను సమకూర్చుకుంటోంది. తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జగన్ మరియు ఆయన పాలన పైన కీలక వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ పాలనతో ప్రజలు విసిగిపోయారు. సంక్షేమంతో ప్రజలు తనకు ఓట్లు వేస్తారన్న నమ్మకంతో ఉన్న జగన్ అండ్ కో కు 2024 లో జరగనున్న ఎన్నికలలో వైసీపీ ఓడిపోవడం ఖాయమని చెప్పాడు.
అంతే కాకుండా ఏ ప్రజల మీద అయితే కొండంత నమ్మకం పెట్టుకున్నాడో వాళ్ళే వైసీపీని బంగాళాఖాతంలో కలిపేస్తారని సెన్సషనల్ కామెంట్స్ చేశాడు. మరి ఏపీ ప్రజలు ఏ పార్టీని వచ్చే ఎన్నిక్కల్లో గెలిపించనున్నారు అన్నది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.