ఏపీ సీఎం జగన్ యూరప్ టూర్‌కు సీబీఐ అనుమతి……

-

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ పర్యటనకు వెళ్లేందుకు సీబీఐ అనుమతించింది. సీఎం జగన్ సీబీఐ కోర్టులో తన వ్యక్తిగత పర్యటనకు అనుమతించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతును సడలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై సీబీఐ ఈ నెల 17న కౌంటర్ దాఖలు చేయగా మంగళవారం కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ క్రమంలో ఈ నెల 21 నుంచి 29 వరకూ జగన్ యూరప్ టూర్‌కు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, పర్యటనకు ముందు జగన్ తన మొబైల్ ఫోన్, ఈ-మెయిల్ ఐడీ, పర్యటన వివరాలు కోర్టుకు, సీబీఐకి ఇవ్వాలని ఆదేశించింది.

AP administration to shift to Vizag in September: CM Jagan Mohan Reddy

సీఎం జగన్ ఈ శుక్రవారం లండన్ వెళ్లాల్సి ఉండగా, ఆ పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై కేంద్రంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లనున్నట్లు ఏపీ సీఎస్‌ జవహర్‌ రెడ్డి తెలిపారు. కేంద్ర కార్యదర్శుల సమావేశానికి బుధవారం ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్తున్న ఏపీ ప్రభుత్వ టీమ్ తో పాటు సీఎం జగన్ ఢిల్లీలో పర్యటించనున్నారని తెలుస్తోంది. ఈ కారణాలతో సీఎం జగన్ యూరప్ పర్యటన కూడా వాయిదా వేసుకున్నారని సీఎస్ వెల్లడించారు. సీఎం ఢిల్లీ పర్యటన పై మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని, వాటిని నమ్మవద్దని జవహర్ రెడ్డి అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news