వేసవి కాలంలో రకరకాల సమస్యలు వస్తాయి వేసవి కాలంలో ఆసిడ్ రిఫ్లెక్ట్ సమస్యను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి యాసిడ్ రిఫ్లెక్స్ సమస్యని వేసవికాలం ఎలా ఎదుర్కోవాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం… వేసవికాలంలో మనకి బాగా ఆకలి తగ్గిపోతుంది ఎక్కువ వేడి చెమట వలన జీర్ణవ్యవస్థ పాడవుతుంది. సో వేసవికాలంలో మనం ఎక్కువ ద్రవ పదార్థాలను తీసుకుంటూ ఉంటాం. సాలిడ్స్ ని తగ్గించేస్తూ ఉంటాము. అయితే వేసవి కాలంలో ఛాతిలో తీవ్రమైన యాసిడ్ ఏర్పడుతుంది.
ఆహార పదార్దాలు త్వరగా జీర్ణం అవ్వవు. తేనుపులు కూడా వస్తూ ఉంటాయి ఇదే సమస్యతో మీరు కూడా బాధపడుతున్నారా..? అయితే కచ్చితంగా ఈ విషయాలను చూడాల్సిందే. అప్పుడు ఈజీగా సమస్య నుండి బయటపడవచ్చు. అల్లం లో యాసిడ్ రిఫ్లెక్ష్ లక్షణాలు ఉంటాయి. ఉపశమనాన్ని మీకు అల్లం ఇస్తుంది. యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు కూడా ఉంటాయి. కడుపు ఉబ్బరం ఎసిడిటీ వంటి సమస్యలు కూడా ఉండవు. అల్లం టీను తయారు చేసుకుని మీరు తాగితే ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలానే యాసిడ్ రిఫ్లెక్ట్ సమస్యని పైనాపిల్ కూడా పోగొడుతుంది.
పైనాపిల్ ని తీసుకుంటే తిన్న ఆహారం జీర్ణం అవుతుంది పైనాపిల్లో బ్రొమిలిన్ అనే మూలకం ఉంటుంది ఇది బాగా జీర్ణం అయ్యేటట్టు చూస్తోంది. అవకాడో తో కూడా ఈ సమస్యని పోగొట్టొచ్చు ఫైబర్ కడుపులో పేగులలోని టాక్సిన్స్ వ్యర్థ పదార్థాలను తొలగించేస్తుంది. మీ జీర్ణ క్రియ ని ఇది మెరుగుపరుస్తుంది. కీర కూడా ఈ సమస్యని పోగుడుతుంది కీరాలో 96% నీళ్లు ఉంటాయి కీరాని తీసుకుంటే శరీరం కోల్పోయిన నీటిని మనం తిరిగి పొందడానికి అవుతుంది. జీర్ణశక్తిని పెంచుతుంది కూడా. చామంతి టీ కూడా ఈ సమస్య నుండి బయట పడేస్తుంది. ఇందులో చక్కటి గుణాలు ఉంటాయి. రోజూ రాత్రి నిద్రపోయే ముందు ఒక కప్పు చామంతి టీ తీసుకుంటే జీర్ణ సమస్యలు ఉండవు ఇలా వేసవికాలంలో మనం యాసిడ్ రెఫ్లెక్ట్ సమస్య నుండి ఈ విధంగా బయటపడొచ్చు.