విజయ్ తో లవ్..రష్మిక హాట్ కామెంట్స్ !

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జోడి గీతాగోవిందం సినిమాతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా వీరు నటించారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా అలరించలేదు. అయితే ఈ రెండు సినిమాల ద్వారా ఏర్పడిన వీరి పరిచయం మరింతగా బలపడిందని చెప్పాలి. ఇది ఇలా ఉండగా.. ఇప్పుడు ఈ జంట మాల్దీవుల్స్‌ లో ఎంజాయ్‌ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ తరుణంలోనే రష్మిక ప్రేమపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్‌ గా మారాయి. ఎవరితోనైనా రిలేషన్ లో ఉన్నారా? అని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆమెను ప్రశ్నించగా, తెలుగు, తమిళం, హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉండడం వల్ల కుటుంబ సభ్యులతో గడపడానికే సమయం చిక్కడం లేదని, ఇక ప్రేమ వ్యవహారాలకు టైం ఎక్కడిదంటూ ఎదురు ప్రశ్నించింది సుందరి.

రష్మిక మాట్లాడుతూ ‘ప్రేమను నిలబెట్టుకోవడం అంత సులభం కాదు. అందుకు చాలా సహనం కావాలి. టైము కూడా చాలా ముఖ్యం. ఇప్పటికే ఇంట్లో అందుబాటులో ఉండడం లేదని మా ఫ్యామిలీ మెంబర్స్ బాధపడుతుంటారు. ఇప్పుడైతే నేను ఏ రిలేషన్ లో లేను ఎవరినైనా ప్రేమిస్తే నేనే ఆ విషయాన్ని ముందుగా వెల్లడిస్తా’ అని చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version