Samantha : ఆ హీరోయిన్ ప్రాణాలు కాపాడిన స‌మంత‌! నెట్టింట్లో ప్ర‌శంస‌ల వెల్లువ‌..

-

Samantha: స‌మంత.. ఏం మాయ చేశావే అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఏంట్రీ ఇచ్చింది. త‌న అందం, అభిన‌యంతో అన‌తికాలంలోనే టాప్ హీరోయిన్ గా నిలిచింది. ఈ క్ర‌మంలోనే నాగ చైత‌న్యను పెళ్లి చేసుకుని మరింత క్రేజ్ సంపాదించుకుంది. కెరీర్ లో మ‌రింత క్రేజ్ సంపాదించుకుంది. వ‌రుస‌గా సినిమాలు చేస్తు చాలా బిజీ బిజీగా మారింది. కానీ, విధి వ‌క్రీక‌రించింది. ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా చైతూ- సామ్ లు వీడిపోయారు. విడాకుల తర్వాత సమంత ఎక్కువగా వార్తల్లో నిలిచింది.

విడాకుల విష‌యంలో సమంత ఎన్నో నిందలు, ఆరోపణలు ఎదుర్కొంది. ఆమెను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేస్తూ.. శృతిమించేలా అసత్య కథనాలు ప్రచారం చేశాయి కొన్ని యూట్యూబ్ ఛాన‌ల్స్ . దీంతో స‌మంత కోర్టుకెక్కి వాళ్ళ నోర్లు మూయించింది. ఈ క్ర‌మంలో విడాకుల బాధని దిగమింగుతూ సమంత తిరిగి నార్మల్ కావడానికి స‌మంత త‌న స్నేహితులతో కలసి తీర్థయాత్రలకు, వెకేషన్స్ కి వెళుతోంది. ఇప్ప‌డిప్పుడే.. తన వర్క్ పై ఫోకస్ పెడుతోంది.

తాజాగా సమంత గొప్ప దాతృత్వాన్ని చాటి చెప్పేలా ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. టాలీవుడ్ లో యంగ్ బ్యూటీ తేజ‌స్వీ.. త‌న జీవితంలో సమంత ఏవిధంగా ఆదుకుందో తెలిపింది. అంద‌రిలాగేనే తాను కూడా ఆరంభంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తేజస్వి తెలిపింది. కెరీర్ ప్రారంభంలో చిన్న రోల్స్ పాత్ర‌లకే ప‌రిమితమ‌య్యాన‌ని, ఇంటి నుంచి కూడా స‌పోర్టు లేక‌పోవ‌డంతో.. ఆర్థికంగా చాలా ఇబ్బంది ప‌డ్డాన‌ని తెలిపింది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సమయంలో త‌న‌కు టీబీతో బాధ‌ప‌డ్డ‌న‌ని, ఆ స‌మ‌యంలో వైద్యులు ఆపరేషన్ చేయించుకోవాలని సూచించారు. కానీ అంత డబ్బు లేకపోవ‌డంలో సైలెంట్ అయ్యింద‌ట‌. కానీ ఆ నోటా ఈ నోటా ఈ విష‌యం సమంతకు తెలిసింద‌ట‌. వెంట‌నే తేజస్విని పిలిచి.. వైద్యం ఖర్చు మొత్తం తానే భరించినట్లు స‌మంత భ‌రోసా ఇచ్చింద‌ట‌. ఈ సంఘటన తాజాగా వెలుగులోకి రావడంతో అభిమానులు సమంతపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక సమంత సేవా కార్యక్రమాలు, గొప్పమనసు గురించి చాలా మందికి తెలుసు. ప్రత్యూష పౌండేషన్ ప్రారంభించిన సమంత ఎందరో చిన్న పిల్లలకు ఉచితంగా వైద్యం అందిస్తున్న విష‌యం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version