తెలంగాణలో హిందు దేవతల మీద దూషణ జరుగుతోందన్నారు పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. బాసర సరస్వతి అమ్మవారిపై చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికం అని మండిపడ్డారు. అంబెడ్కర్ ఎప్పుడు ఇతర మతాలను విమర్శించవద్దన్నారని.. రాజ్యాంగం లో లౌకికతత్వం రూపొందించింది అంబెడ్కర్ అన్నారు అద్దంకి దయాకర్. మొన్న అయ్యప్ప స్వామి… ఇవాళ సరస్వతి దేవిపై కామెంట్స్ ఎందుకు చేస్తున్నారని అన్నారు. అసలు బైరి నరేష్ తో బండి సంజయ్, ఈటెల మీటింగ్ వెనక వ్యూహం ఏంటి ? అని ప్రశ్నించారు.
కమలాపుర్ మీటింగ్ వెనక రహస్యం ఏంటో బయటకు రావాలని డిమాండ్ చేశారు. బిజెపి ప్రోద్బలంతోనే ఈ వివాదాలు చెలరేగుతున్నాయని ఆరోపించారు అద్దంకి దయాకర్. హిందు మతాన్ని తిడితే గొప్పోళ్ళు అన్నట్టు ఫీల్ అవుతున్నారని.. అంబెడ్కర్ హిందు మతం కి వ్యతిరేకి అనే భావన తెస్తున్నారని మండిపడ్డారు. దీన్ని మేము సచ్చినా ఆమోదించం అన్నారు. రాజకీయం కోసం విద్వాంస, విచ్ఛిన్నకర శక్తిగా బీజేపీ మారిందని మండిపడ్డారు.