ఆఫ్ఘనిస్తాన్ లో వరుస బాంబు పేలుళ్లు కలకలం సృష్టిస్తున్నాయి.ఆఫ్ఘనిస్తాన్ లో ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు.ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ లో గురువారం రాత్రి బస్సులో బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు.రెండు బాంబు పేలుళ్లలో తొమ్మిది మంది మృతి చెందగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.బాల్హ్క్ ప్రావిన్స్ రాజధాని మజార్- ఇ – షరాఫ్ లో రెండు మినీ బస్సును లక్ష్యంగాా చేసుకొని ఐఎస్ఐఎస్ ముష్కరులు పేలుళ్లు జరిపినట్టు తాలిబన్ అధికారులు వెల్లడించారు.షియాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది.తాజాగా జరిగిన దాడికి తామే కారణమంటూ ఐఎస్ ఐఎస్ ప్రకటించింది.
కాగా గత వారం రోజుల కిందట మసీదు, మతపరమయిన పాఠశాలలో జరిగిన బాంబు పేలుళ్లలో 33 మంది మృతి చెందగా 43 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.క్షతగాత్రుల్లో చాలా మంది విద్యార్థులు ఉన్నారు.ఇలాంటి దాడులు ఎక్కువగా ఐసిస్ చేస్తుంది.ఇలాంటి దాడులను అరికట్టేందుకు అక్కడి భద్రతా బలగాలు ఎన్ని చర్యలు చేపట్టినా ఎక్కడో ఓ చోట దాడులకు పాల్పడుతూనే ఉన్నారు.వీరి దాడుల కారణంగా అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.