2 పేజీలతో వైసీపీ మేనిఫెస్టో సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చేయగలిగినవి మాత్రమే చెబుతున్నాం అని,మళ్లీ అధికారంలోకి రాగానే విశాఖ రాజధానినిగా పరిపాలన సాగుతుంది అని తెలిపారు. రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్‌గా.. విశాఖను అభివృద్ధి చేస్తాం.. అమరావతిని శాసనరాజధానిగా చేస్తాం.. కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తాం అని వెల్లడించారు.
వైఎస్సార్ చేయూత రూ.75 వేల నుంచి 8 విడతల్లో రూ. లక్షా 50 వేలకు పెంపు, వైఎస్సార్ కాపు నేస్తం నాలుగు దఫాల్లో రూ. 60 వేల నుంచి లక్షా 20 వేల వరకు పెంపు, వైఎస్సార్ ఈబీసీ నేస్తం నాలుగు దఫాల్లో రూ.45 వేల నుంచి రూ.లక్షా 5 వేల వరకు పెంపు, రైతు భరోసా సొమ్ము ఏడాదికి రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంపు. కౌలు, అటవీ, దేవాదాయ శాఖ భూముల సాగుదార్లకు రైతు భరోసా, ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ పంట రుణాలు కొనసాగింపు.చేనేత నేస్తం రూ. లక్షా 20 వేల నుంచి రూ.2లక్షల 40వేల వరకు పెంపు. మత్స్యకార భరోసా రూ. లక్ష వరకు, వాహన మిత్ర రూ.లక్ష వరకు పెంపు .మహిళలకు రూ.3లక్షల వరకు సున్నా వడ్డీ కింద రుణాలు.వైఎస్‌ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా కొనసాగిస్తామని అన్నారు.