అగ్నిపథ్ స్కీమ్ వివాదం.. వైసీపికి ప్లస్ అవుతుందా?

-

అగ్నిపథ్ స్కీమ్ వివాదానికి సంబంధించి గలాటా దేశంలోని పలు రాష్ట్రాల్లో జరుగుతోంది. తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం జరిగింది.ఈ ఘటనపై టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విధ్వంసాల్ని ఖండించారు. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందడం పట్ల జనసేనాని సంతాపం వ్యక్తం చేశారు.

ఘటన జరగడానికి ఏపీ అడ్డాగ మారిందనే వార్తలు వినిపిస్తున్నాయి..రాజకీయ చర్చలు కూడా అందుకు ఆజ్యం పోస్తున్నాయి.డిఫెన్స్ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు ఈ తతంగానికి స్కెచ్ వేసినట్లుగా అనుమానిస్తూ అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకపోవడం గమనార్హం. అది కొంత ఏపీ ఊపిరి పీల్చుకోవాల్సిన విషయమే. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైసీపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఇంతకీ, ఈ వివాదం కారణంగా మారే రాజకీయ సమీకరణాలు ఎలా వుండబోతున్నాయి.? దేశవ్యాప్తంగా బీజేపీకి ఎదురుగాలి వీయడమైతే సహజమే. పైగా, వరుసగా రెండుసార్లు దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది.

కొన్ని కార్యకలాపాల వల్ల బీజెపికి వ్యతిరేకథ వుంది.ఇప్పటికే పెట్రోధరల మంట సహా అనేక అంశాల్లో మోడీ సర్కారు వైఫల్యాల పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో వున్నారు. సో, వచ్చే ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ‘ఖేల్ ఖతం.. దుకాణ్ బంద్..’ అనే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఓ రకంగా వైసీపీకి అడ్వాంటేజ్. బీజేపీకి జాతీయ స్థాయిలో మెజార్టీ తగ్గితే, ఏపీ నుంచి ఎంపీల బలం అవసరమవుతుంది. అప్పుడు ఏపీ నుంచి ప్రత్యేక హోదా డిమాండ్ గట్టిగా వినిపించేందుకు వైసీపీకి అవకాశం దొరుకుతుంది.ఎలా చూసుకున్నా కూడా ఏపీకి ప్లస్ అవుతుంది రాజకీయ వర్గాలు అభిప్రాయ పడుతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news