సమంత అనారోగ్యంపై అక్కినేని అఖిల్ సంచలన ట్వీట్ !

-

తన అనారోగ్యం గురించి..తాజాగా నటి సమంత ఓపెన్ అయ్యింది. మయోసిటిస్‌ అనే ఆటో ఇమ్యూనిటీ కండిషన్‌తో బాధపడుతున్నట్లు తెలిపింది. ఆరోగ్యం నిలకడగానే ఉందని.. త్వరలోనే కోలుకుంటానని ధీమా వ్యక్తం చేసింది. చేతికి సెలైన్‌‌ ఎక్కుతుండగా.. యశోద సినిమాకు డబ్బింగ్ చెబుతూ ఆమె ఈ పోస్ట్ చేసింది.

దీంతో స్టార్ హీరోలు, అభిమానులు ఆమె కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ తరుణంలో ఆమె అనారోగ్యంపై అఖిల్ అక్కినేని స్పందించాడు. ‘డియర్ సామ్, అందరి ప్రేమాభిమానాలే నీకు మరింత బలాన్నిస్తాయి’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ఆమె మాజీ భర్త నాగచైతన్య ఇంకా స్పందించలేదు.

 

Read more RELATED
Recommended to you

Latest news