స్టార్ హీరోయిన్ ఒడిలో యంగ్ హీరో..ఆనందోత్సాహంలోనా? ప్రేమనా?

-

అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన హీరో సుశాంత్ అనుమోలు..చాలా కాలం నుంచి సరైన సక్సెస్ సినిమా కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘అల వైకుంఠపురములో’ ఫిల్మ్ లో చక్కటి పాత్ర పోషించి ప్రేక్షకుల ప్రశంసలు పొందిన సుశాంత్..ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.సుశాంత్ నటించిన ‘ఇచట వాహనములు నిలుపరాదు’ సినిమా గతేడాది విడుదలైంది. ఈ పిక్చర్ అనుకున్న స్థాయిలో ఆడలేదు.

ఈ క్రమంలోనే సుశాంత్ నటించే నెక్స్ట్ సినిమాలైనా హిట్ కావాలని అక్కినేని కుటుంబ అభిమానులు కోరుకుంటున్నారు. మాస్ మహారాజ రవితేజ – సుధీర్ వర్మ కాంబోలో తెరకెక్కుతున్న ‘రావణాసుర’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు సుశాంత్. దీంతో పాటు జీ5 ఒరిజినల్ ‘#MNT’ కూడా చేస్తున్నారు. హ్యాష్ ట్యాగ్ ఎంఎన్‌టీ సుశాంత్ డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

‘వరుడు కావలెను’ ఫేమ్ దర్శకురాలు లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ జీ5 ఒరిజినల్ లో సుశాంత్ కు జోడీగా ‘లీడర్’ ఫేమ్ హీరోయిన్ ప్రియా ఆనంద్ నటిస్తోంది. ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో పలు చిత్రాలు చేసిన స్టార్ హీరోయిన్ ప్రియా ఆనంద్ ప్రజెంట్..జీ5 ఒరిజినల్ ఎంఎన్‌టి లో నటిస్తోంది. కాగా, షూటింగ్ సందర్భంగా ప్రియా ఆనంద్ తో దిగిన ఫొటో ఒకటి సుశాంత్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. సదరు ఫొటో ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఫొటోలో కుర్చీలో కూర్చొని ఉన్న ప్రియా ఆనంద ఒడిలో సుశాంత్ కూర్చొని ఉన్నాడు. అప్పుడు ప్రియా ఆనంద్, సుశాంత్ ఇద్దరూ నవ్వుతున్నారు. ‘#MNT నవ్వులు ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్’ క్యాప్షన్ తో సుశాంత్ ఈ ఫొటో షేర్ చేయగా, అది చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తాము కూడా ఆనందంగా ఫీలవుతున్నామని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, ప్రియా , సుశాంత్ బాగున్నారని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ప్రియా మీద నుంచి లెగు అని ఇంకొందరు నెటిజన్లు సుశాంత్ కు సూచిస్తున్నారు. మొత్తంగా సుశాంత్ ఇప్పటికైనా తన కెరీర్ పైన ఫుల్ ఫోకస్ చేసి సరైన స్క్రిప్టులను సెలక్ట్ చేసుకుంటున్నాడని చెప్పొచ్చు. ‘రావణాసుర’లో కీలక పాత్ర సుశాంత్ పోషిస్తుండగా ఆ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 30న విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news